కాజల్ అగర్వాల్..లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి పర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చందమామ, మగధీర కాజల్ కెరీర్‌ను పీక్స్‌కి తీసుకెళ్ళాయి. మగధీర సినిమాతో ఏకంగా స్టార్ హీరోయిన్‌గా మారిన కాజల్ రెమ్యూనరేషన్ పరంగానూ హై లెవల్‌కి చేరుకుంది.
దాదాపు తెలుగులో ఉన్న అందరు హీరోలతోనూ కాజల్ స్క్రీన్ షేర్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన రెండు సినిమాలు చేసిన కొన్ని కారణాల వల్ల ఓ సినిమా నుంచి ఆమె సన్నివేశాలను తొలగించారు. ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్‌గా సక్సెస్‌లు అందుకున్న కాజల్ తమిళం, హిందీ భాషలలోనూ మంచి చిత్రాలను చేసి క్రేజ్ తెచ్చుకుంది.
వెబ్ సిరీస్ కూడా కాజల్ అగర్వాల్‌కి బాగా కలిసి వచ్చాయి. సినిమా అంటే ఓ కమిట్‌మెంట్ అని పక్కా ప్రొఫషనల్‌గా భావించి అందాల ఆరబోతకి కథకి తగ్గట్టు ఒప్పుకొని హాట్ టాపిక్ అయింది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకత్వంలోనే అవకాశం ఉన్నంతవరకూ అందాలను ఆరబోసి వేడెక్కించింది. అయితే, కాజల్ అగర్వాల్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో కాస్త ఈ అందాల ఆరబోతకి దూరమయింది.
అంతేకాదు, ఇప్పుడు తల్లైయ్యాక ఒప్పుకునే ప్రతీ సినిమాకి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుందట. మునపటి మాదిరిగా అన్నీ తెరిచి అందాలను ఆరబోకుండా డీసెంట్ పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్టుగా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి అందాల చందమామ పొదుపుగా బట్టలు కట్టుకొని గ్లామర్ ట్రీట్ ఇవ్వకపోతే అభిమానులు ఏమై పోతారో మరి.