Moviesపూజాహెగ్డే ఇల్లు ఆని కోట్లా..? అన్నిటికన్న హైలెట్ అదే.. చూస్తే షాక్...

పూజాహెగ్డే ఇల్లు ఆని కోట్లా..? అన్నిటికన్న హైలెట్ అదే.. చూస్తే షాక్ వ్వాల్సిందే..వేరే లెవెల్..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హోమ్ టూర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ అందరు హోమ్ టూర్ అంటూ ఓ రకమైన కాన్సెప్ట్ తో తమ ఇల్లుని ఎలా తీర్చిదిద్దుకున్నారు.. ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెట్టుకున్నారో క్లియర్ గా చెప్తూ వీడియోస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమం లోనే స్టార్ సెలబ్రిటీలు సైతం ఇష్టపడి కష్టపడి కట్టించుకున్న ఇంటిని హోమ్ టూర్ చేసి అభిమానులతో పంచుకుంటున్నారు .

ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్న తన హోమ్ టూర్ ని చేసి అభిమానులకు సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఏషియన్ పెయింట్స్ వేర్ ది హాట్ ఇస్ సిరీస్ అనే వీడియోలో భాగంగా హోమ్ టూర్ చేసింది. ఎంట్రెన్స్ తో స్టార్ట్ చేసిన పూజ హెగ్డే ..ప్రతి వస్తువును తాను ఎంతో ఇష్టపడి కష్టపడి కొనుక్కున్నట్టు .. ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ వాస్తు ప్రకారం నిర్మించబడింది అంటూ.. మా అమ్మ నాన్నలు అలానే ప్లాన్ చేశారు అని చెప్పుకొచ్చింది. అంతే కాదు గ్రీన్ కలర్ లోని పెద్ద తలుపులను ఓపెన్ చేసి స్వాగతం పలికి డోర్ పై గోల్డ్ లెటర్స్ తో పూజ హెగ్డే అనే పేరును సెట్ చేయించడం ఇంటికి హైలైట్ గా మారింది .

అంతేకాదు ఇంట్లోని ప్రతి వస్తువు, ఫర్నిచర్ , పెయింటింగ్స్, ఇంటీరియర్ డిజైనర్.. అన్నీ కూడా తానే బుక్స్ సెర్చ్ చేసి మరి డిజైన్ చేయించుకున్నట్లు చెప్పింది. ముఖ్యంగా కిచెన్ ఇంటీరియర్స్ లైటింగ్స్, టైల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంతేకాదు వంటగదిని కూడా పూజా హెగ్డే చాలా అద్భుతంగా సర్దుకునింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .

అంతేకాకుండా వెరైటీగా వంటగదికి రెండు స్లైడింగ్ డోర్స్ ను ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది . అంతేకాదు ఎటువంటి పొగా ,ఘాటు, రాకుండా మోద్రెన్ పరికరాలతో కిచెన్ సెట్ చేసుకుంది పూజ హెగ్డే . అంతే కాదు తన బెడ్ రూమ్ చాలా హైలైట్ గా మారింది . ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే పూజ ఇల్లు ఖరీదు సుమారు 15 కోట్ల పై మాటే అన్న టాక్ ఎక్కువుగా వినిపిస్తుంది. అంతేకాదు ఇంటికి సంబంధించిన ప్రతి రూపాయి.. పూజ హెగ్డే తన సొంత డబ్బులతోనే ఖర్చు చేసిందట . ఏది ఏమైనా సరే పూజా హెగ్డే సూపర్ అంటున్నారు ఫాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news