ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణించిన హీరోయిన్ లలో యమున కూడా ఒకరు. యమున స్టార్ హీరోలకు సైతం జోడీగా సినిమాలు చేసి చాలా కాలం పాటూ ఫుల్ బిజీగా ఉన్నారు. 1990వ దశకంలో యమునకు తెలుగులో మహిళా ఫ్యాన్స్ ఉండేవారంటే నమ్మాల్సిందే. మౌనపోరాటం సినిమా తరవాత యమున స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు. ఆ తరవాత పలు చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలలోనే కాకుండా టీవీ సీరియల్స్ లోనూ నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.
ఈటీవీలో వచ్చిన విధి సీరియల్లో ఆమె లేడీ విలన్‌గా చేసిన నటన అదిరిపోయింది. బుల్లితెర జనాలంతా కేవలం యమున విలనిజం చూసేందుకే టీవీలకు అతుక్కుపోయేవారు. అసలు ఇప్పటి సీరియల్స్‌లో ఎంతమంది లేడీ విలన్లు వచ్చినా ఈ పాత్రలకు ట్రెండ్ సెట్ చేసింది మాత్రం యమునే. అయితే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న యమున కెరీర్ పై మాయని ఓ మచ్చ పడింది. 2011వ సంవత్సరంలో యమున బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
బెంగుళూరులోని రాయల్ ఐటిసి హోటల్ లో యమున వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని ఆమెతో పాటు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు గా వార్తలు వినిపించాయి. ఈ వార్తలు రావడంతోనే యమున కెరీర్ పై ఎఫెక్ట్ అయ్యింది. ఆ తరవాత యమునకు సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించిన యమున తాను ఏ తప్పు చేయలేదని కావాలనే తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఆ రోజు హోటల్ కు వెళ్లలేదని సీసీపీ ఆఫీసుకు వెళ్లానని చెప్పింది. కానీ తనపై లేనిపోని అభండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వార్తలు రావడంతో తాను చనిపోవాలని అనుకున్నట్టు చెప్పింది. తాను చనిపోతే తన పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఉంటుందని భావించానని చెప్పింది. కానీ నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి అంటూ తన స్నేహితులు అన్నారని అందుకే ధైర్యం తెచ్చుకుని బ్రతికి ఉన్నానని తెలిపింది.
నిజం ఎప్పటికైనా ప్రజలకు తెలియాలని అందుకే చెబుతున్నానని పేర్కొంది. ఆ వార్తల తరవాత చాలా కాలం పాటూ తను బయటకు రాకుండా ఉన్నానని కానీ నిజం చెప్పడం కోసమే బయటకు వచ్చానని పేర్కొంది. ఏదేమైనా ఆ సంఘటన తర్వాత యమున కనీసం బుల్లితెరపై కూడా అడ్రస్ లేకుండా పోయింది.