Gossipsఅజ్ఞాతంలో ఇంజ‌నీరింగ్ బాబు

అజ్ఞాతంలో ఇంజ‌నీరింగ్ బాబు

గ‌బ్బ‌ర్ సింగ్‌, అత్తారింటికి దారేది హిట్లు త‌రువాత ప‌వ‌న్ కెరియ‌ర్ కి కలిసొచ్చే చిత్రం ఒక్క‌టీ రాలేదు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ , కాట‌మ రాయుడు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా, అంత‌కుముందు విడుద‌లైన గోపాల గోపాల యావ‌రేజ్ గా నిలిచింది.ఈ సారి మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తో క‌లిసి ప‌నిచేస్తున్నారాయ‌న‌.

ఈ సినిమాకు అజ్ఞాత వాసి అన్న టైటిల్ ని ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. తొలుత ఇంజ‌నీరింగ్ బాబు అని టైటిల్ అనుకున్నా, ఆఖ‌రికి ఈ టైటిల్ వైపే ప‌వ‌న్ మొగ్గు చూపార‌ని స‌మాచారం. ఇదే టైటిల్ ని చిత్ర యూనిట్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారట.  ఇటీవల పవన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుద‌ల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్ అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రించింది. దీపావ‌ళికి ఫ‌స్ట్ లుక్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరి 10న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.మ‌రోవైపు జ‌న‌సేనాని త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను సైతం విస్తృతం చేయ‌నున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లో ఆయ‌న పాద యాత్ర  చేప‌ట్టే అవ‌కాశాలున్నాయి.అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌ను సైతం ఆయ‌న వెలువ‌రించ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news