Gossipsఅల్లు వారింటి ఆతిథ్యం బన్నీ రూటే సెపరేటు...

అల్లు వారింటి ఆతిథ్యం బన్నీ రూటే సెపరేటు…

అతిథి దేవో భ‌వ అన్న‌ది పెద్ద‌ల మాట‌.. ఈ మాట‌నే పాటిస్తున్నాడు అల్లు వారింటి అబ్బాయి.త‌న  సినిమా షూటింగ్ చూసేందుకు, త‌న‌ని క‌లిసేం దుకు వ‌చ్చిన అభిమానుల‌కు క‌మ్మ‌ని భోజ‌నం పెట్టి మ‌రీ పంపుతున్నాడు.అంద‌మైన ఊటీ లోగిలిలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమా షూటింగ్ సాగుతుండ‌గా, అక్క‌డికి వ‌స్తోన్న అభిమానుల‌ను ప‌ల‌క‌రించి, భోజ‌నం పెట్టి మ‌రీ పంపుతున్నాడీ హీరో.

సాధారణంగా షూటింగ్ ల‌కు వ‌చ్చే అభిమాన‌ల‌తో ఫొటోలు దిగ‌డం ఆన‌వాయితీ. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేసి త‌న కోసం ప్రేమ‌గా వ‌చ్చిన‌వారి కోసం త‌న‌వంతు బాధ్య‌త‌గా ష‌డ్రశోపేతమైన భోజ‌నం పెట్టించి పంపుతున్నాడు. ఇది విని టాలీవుడ్ జ‌నం తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన మ‌ల‌యాళ భామ అను ఇమ్మాన్యుయెల్ న‌టిస్తోంది.త‌న అంద‌చందాల‌తో అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు కేర‌ళ‌, త‌మిళ‌నాడులోనూ బ‌న్నీకి ఫ్యాన్స్ ఉండ‌డంతో ఊటీ మొత్తం అభిమానుల రాక‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈ సుంద‌ర తీరం షూటింగ్ సంద‌డితో ప్ర‌తిరోజూ కొత్త అందాల‌ను నింపుకుంటోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news