Moviesలిప్‌లాక్‌లు, క‌మిట్‌మెంట్లు, శృంగారం, బోల్డ్‌సీన్లు.. సెగ‌లురేపిన తేజ‌స్విని ' క‌మిట్మెంట్ '...

లిప్‌లాక్‌లు, క‌మిట్‌మెంట్లు, శృంగారం, బోల్డ్‌సీన్లు.. సెగ‌లురేపిన తేజ‌స్విని ‘ క‌మిట్మెంట్ ‘ ట్రైల‌ర్ (వీడియో)

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు చాలా తక్కువ అవకాశాలే వస్తున్నాయి. గత కొన్నేళ్లలో తెలుగమ్మాయిలలో అంజలి – తేజస్విని మాదివాడ – ఈషా రెబ్బా – ప్రియాంక జువాల్కర్ లాంటి చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఓ వెలుగు వెలిగారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన‌ తేజస్వి సినీ రంగంలో ఓ వెలుగు వెలిగి పోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చింది. మహేష్ బాబు – వెంకటేష్ హీరోగా నటించిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు మరదలుగా నటించింది.

ఆ త‌ర్వాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమాతో హీరోయిన్ అయింది. ఈ సినిమాతో ఆమెకు కావాల్సినంత ర‌చ్చ, పాపులారిటీ వ‌చ్చేసింది. ఐస్ క్రీం వర్మ సినిమా కావటంతో అమ్మడిపై సహజంగానే బోల్డ్ ముద్ర పడిపోయింది. అప్పటినుంచి తేజ‌స్వినికి ఎక్కువుగా బోల్డ్ త‌ర‌హా పాత్ర‌లే వ‌చ్చాయి. ఆ త‌ర్వాత చాలా రోజుల పాటు ఆమె తెలుగు సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది.

మ‌ళ్లీ ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత క‌మిట్మెంట్ అనే బోల్డ్ టైప్ పాత్ర‌లోనే రీ ఎంట్రీ ఇస్తోంది. తేజ‌స్విని మాదివాడ‌, త‌నిష్క్ రాజ‌న్‌, సీమ‌ర్‌సింగ్ లాంటి హాట్ బోల్డ్ బ్యూటీలు ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఎప్పుడో రెండేళ్ల క్రిత‌మే ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. అప్పుడే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇక తాజాగా వ‌దిలిన ట్రైల‌ర్లో ఇద్ద‌రు హాట్ బ్యూటీలు బోల్డ్ సీన్ల‌తో పిచ్చిగా రెచ్చిపోయారు. అస‌లు లిప్‌కిస్‌లు, ప్ర‌తి సీన్లోనూ కామర‌సంతో ఊగిపోయేలా రెచ్చిపోయి న‌టించారు. అయితే చివ‌ర్లో ఓ వైపు బోల్డ్ సీన్లు వ‌స్తున్నా కూడా వెన‌క భగవద్గీత బ్యాక్ డ్రాప్ కాంట్రవర్సీకి కార‌ణ‌మైంది. ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ హాట్ ట్రైల‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news