కోలీవుడ్‌లో జీవా హీరోగా ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన మాస్క్ సినిమా డిజాస్టర్. ఆ సినిమాతోనే పూజా హెగ్డే హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయ్యింది. అసలు పూజా హెగ్డేను బాలీవుడ్ వాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈమె ఏంటి హీరోయిన్ ఏంటని దెప్పిపొడిచారు. చాలా చులకనగా చూశారు. అప్పుడు సౌత్ సినిమా.. ఇంకా చెప్పాలంటే మన టాలీవుడ్ వాళ్లే నెత్తిన పెట్టుకుని ఆరాధించి.. వరుస ఛాన్సులు ఇచ్చారు. నాగచైతన్య ఒక లైలా కోసం సినిమా, వరున్ తేజ్ ముకుంద సినిమాల్లో ఆమె చూపులు, క్యూట్ లుక్స్ చూసిన తెలుగు హీరోలు, దర్శకులు ఆమె వెంట పడడం మొదలు పెట్టేశారు.
ఇంకేముందు ఆరేడేళ్లలో ఆమె ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రు. 3 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లిపోయింది. ఏ టాలీవుడ్‌ను వాడుకుని ఆమె స్టార్ హీరోయిన్ అయ్యిందో ఇప్పుడు అదే టాలీవుడ్‌ను ఆమె చిన్న చూపు చూడడంతో పాటు ఇక్కడ సినిమా చేయాలంటే నానా కండీషన్లు పెడుతోంది. ఆమె అడిగిన రేటు ఇవ్వాలి.. ఆమె మందీ మార్బలం ఖర్చులు భరించాలి.. ఇలా చాలా ఇబ్బందులు పెడుతోంది.
పైగా స్టార్ హీరోలు, దర్శకులు ఆమెనే వరుసగా తమ సినిమాల్లో రిపీట్ చేస్తున్నారు. సరే ఇదిలా ఉంటే ఆమె తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో నటించింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాదాపు 3.50 నిమిషాలు ఉన్న ట్రైలర్లో ఆమె కేవలం రెండు సెకన్లలో ఓ బొమ్మలా కనిపించింది. అసలు ట్రైలర్ ఆమె ఉందా ? లేదా ? అన్నది అర్థం కాదు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ను మర్చిపోయినట్టున్నారు అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.
మూడున్నర నిమిషాల ట్రైలర్లో ఎన్నో షాట్లు ఉన్నాయి. పూజాను మాత్రం ఒక్క షాట్.. అది కూడా కేవలం 2 సెకన్లు చూపించడంతో ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది నిజంగానే పూజాకు అవమానం అంటున్నారు. అయితే ఆమె తెలుగు ఇండస్ట్రీని, ఇక్కడ వాళ్లను తక్కువ చూపు చూస్తుండడంతో ఆమెను మాత్రం కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
విజయ్ బీస్ట్ సినిమాలో రేపు పూజ రోల్ కరివేపాకు మాదిరిగా మారిపోతే అప్పుడు పూజాను కోలీవుడ్‌లో పట్టించుకునే వాళ్లే ఉండరని.. అప్పుడు ఆమెకు మాంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇస్తోన్న తెలుగు ఇండస్ట్రీయే మళ్లీ గుర్తుకు వస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా బీస్ట్‌తో కోలీవుడ్‌లో జెండా పాతేద్దాం అనుకున్న పూజా పాప ఆశలు ట్రైలర్‌తోనే గల్లంతైపోయాయి.