Moviesసమంత ఆ పాట చేసింది చైతన్య కోసమా..ఏంటీ ఈ షాకింగ్ ట్వీస్ట్..?

సమంత ఆ పాట చేసింది చైతన్య కోసమా..ఏంటీ ఈ షాకింగ్ ట్వీస్ట్..?

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒక్కటే పాట వినపడుతుంది. అదే ..”ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ”..సాంగ్. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ గా రిలీజ్ అయిన ఈ పాట నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో సమంత మరింత హాట్ గా కనిపిస్తూ అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చింది. సమంత నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌తో క‌లిసి ఒక స్పెష‌ల్ సాంగ్‌లో స‌మంత స్టెప్పులేస్తుంద‌ని తెలియ‌గానే ఫ్యాన్స్ ఎంతో షాక‌య్యారు.

ఇప్పటివ‌ర‌కు తన కెరీర్ లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని స‌మంత‌.. పుష్ప‌లో స్పెష‌ల్ సాంగ్‌కు ఓకే చెప్ప‌డంతో ఇది ఎలా ఉండ‌బోతుందో చూడాల‌ని అంద‌రూ వెయిట్ చేసారు. కాగా రీసెంట్ గా పాటకు సంబంధిన 19 సెచ్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాటలో సమంత హాట్ లుక్స్ తో లంగా జాకెట్ తో బన్నీ పై కూర్చోని వేసే స్టేప్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పాటలోని లిరిక్స్ ని సమంత మాజీ ముగుడు నాగచైతన్య ని ఉద్దేసించే చంద్రబోస్ రాసిన్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ పాటలో ఓ ‘పెద్దమనిషిలాగ ఒకడు పోజులు కొడతాడు.. మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డా కాదు అంతా ఒకటే జాతి.. మగబుద్ధే వంకర బుద్ధి’ అంటూ సాగే ఈ లిరిక్స్ ను చైతూను ఉద్దేశించి రాసిందే అని నెట్టింట నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొనే చంద్రబోస్ ఆ పాట రాసి ఉంటారని కొందరు అంటుంటే..మరికొందరు ఏమో నాగచైతన్య పైనే రివేంజ్ తీర్చుకోవడానికే ఇలా ఐటెం సాంగ్ చేసింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా పుషప ఐటెం సాంగ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news