సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ శోభనకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్తానం ఉంటుంది. బక్కపల్చని భామ అయిన శోభన ఎక్స్‌పోజింగ్‌కు, అసభ్య క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ సబ్జెక్ట్, డెప్త్ ఉన్న క్యారెక్టర్లు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టింది. ఆమె ఓ క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. ఆమె ఎంతో మందికి సౌత్ ఇండియాలో డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి మంచి నృత్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.
శోభన ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఓ పాపను దత్తత తీసుకుని ఆమెను పెంచుకుంటోంది. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న శోభనకు ఓ తమ్ముడు ఉన్నాడు. అతడు కూడా స్టార్ హీరోయే అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ శోభన తమ్ముడే వినీత్. వినీత్ హీరోగా ఉన్నా కూడా శోభనకు తమ్ముడే అన్నది చాలా మందికి తెలియదు. ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రిందట అబ్బాస్, వినీత్ కలిసి నటించిన ప్రేమ దేశం అప్పట్లో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. టబు ఆ సినిమాలో హీరోయిన్.
ఆ తర్వాత వినీత్ సౌత్‌లో పలు భాషల్లో సినిమాలు చేశాడు. వినీత్ కూడా చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నాడు. చిన్నప్పుడే ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు, రివార్డులు కూడా వినీత్ సొంతం చేసుకున్నాడు. ఇక వినీత్ ఇటీవలే తన సెకండ్ ఇన్సింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు. శోభన మాత్రం ఈ వయస్సు వచ్చినా కూడా పెళ్లి లేకుండానే జీవితాన్ని కొనసాగిస్తోంది.