Gossipsమెగా ఫ్యాన్స్‌ని హుషారెత్తించడానికి డైరెక్టర్ సరికొత్త ప్లాన్.. ఎన్నడుచూడని గెటప్ లో...

మెగా ఫ్యాన్స్‌ని హుషారెత్తించడానికి డైరెక్టర్ సరికొత్త ప్లాన్.. ఎన్నడుచూడని గెటప్ లో మెగాస్టార్..?

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో మంది స్టార్‌ హీరోలకు ఆదర్శం అన్న విషయం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. నేరుగా ఆ హీరోలే చెబుతుంటారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పే యంగ్‌ హీరోలు బోలెడు మంది ఉన్నారు. అయితే అటువంటి యంగ్ హీరోలకు ధీటుగా మెగాస్టార్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తూనే.. మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. అందులో మోస్ట్ పాపులర్ తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న ‘భోళా శంకర్’. ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. చిరు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేస్తూ ‘భోళా శంకర్’గా చిరంజీవిని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీలో చెల్లెలు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.

అయితే వేదాళం తెలుగు రీమేక్ లో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం మహానటి సినిమాతొ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయిన కీర్తి సురేష్ ని ఫైనల్ చేసారు మేకర్స్. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా లో మెగాస్టార్ సరి కొత్త రోల్ లో కనిపించనున్నారట. మనం ఇది వరకు ఎప్పుడు చూడని చిరంజీవిని ఈ సినిమాలో చూస్తాం అంతూ ఓ వార్త సినీ వర్గాల నుండి లీకైంది. మెగా ఫ్యాన్స్‌ని హుషారెత్తించేలా మెగాస్టార్‌ని డిఫరెంట్‌ లుక్స్‌లో చూపించాలని అనుకుంటున్నారట. పైగా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఈ లుక్ సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈ సినిమాలో చిరు లుక్స్ ఎలా ఉంటాయో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news