మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త మోడల్స్‌ను కొనడం యంగ్ టైగర్‌కు మక్కువ. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకుంటారు ఎన్టీఆర్. ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు.
అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు ఈయన. అయితే కొంతకాలంగా కార్ మార్చని ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే కొత్త కార్ తీసుకున్నాడట ఇలాంటి కారు హైదరాబాద్‌లోనే కాదు ఇండియాలోనే ఎవరికీ లేదట. అందుకే యంగ్ టైగర్ ఈ కారుపై కన్నేసి మరి కొనుకున్నట్లు ఫిలింనగర్ టాక్.
తాజాగా ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ‘లంబోర్ఘిని’ కారు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంది. అయితే ఈ విధమైనటువంటి కారు మన దేశంలో కొన్న మొదటి వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డును సృష్టించారు. ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడిన ఈ కారు సుమారు మూడు కోట్ల పైగా ఖర్చు చేసి కొన్నారని తెలుస్తోంది.