Moviesఈ ముద్దుగుమ్మలు తమ బాడీలో ఏ పార్ట్ సర్జరీ చేయించుకున్నారో తెలిస్తే.....

ఈ ముద్దుగుమ్మలు తమ బాడీలో ఏ పార్ట్ సర్జరీ చేయించుకున్నారో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ. అందంగా పుట్టడం మనిషికి దేవుడిచ్చిన వరం అన్నది ఒకప్పటి మాట! నేటి కాలంలో వైద్యులే దేవుళ్లవుతున్నారు.. అందాలను చెక్కేస్తున్నారు. అందవిహీనమైన శరీరాలను సైతం అపురూప శిల్పాలుగా మలుస్తున్నారు. అందుకే చాలా మంది సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు కత్తిగాట్లకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు.. అందంగా కనిపించకపోతే… ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు ఈ విషయం అందరికి తెలిసిందే.

అందుకే హీరోయిన్స్ అందాన్ని పెంచుకోవడానికి, మరింతగా అందంగా స్క్రీన్ పై కనిపించడానికి రకర్కాల ప్రయోగాలు చేస్తంటారు. అలాగే తమ ఇమేజ్ ను కాపాడడానికి.. కొందరు భామల సర్జరీలు కూడా చేయించుకున్నారు. ఇలా సర్జరీలు చేయించుకున్నవారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ లిస్టు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన హీరోయిన్లు ఎవరో మనం ఇక్కడ తెలుసుకుందాం రండి ….

శ్రీదేవి: బాలీవుడ్‌ అగ్రతారగా వెలుగొందిన దక్షిణాది భామ శ్రీదేవీ. తొలినాళ్లలోని శ్రీదేవికి, ఆ తర్వాతి శ్రీదేవికి అందంలో చాలా తేడా ఉందన్నది అక్షర సత్యం. ఆమె తన ముక్కుకు చేయించుకున్న సర్జరీనే కారణం.

శృతి హాసన్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. నటిగా కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె తన కెరీర్ మొదట్లో ముక్కు ప్లాస్టర్ సర్జరీ చేయించుకుంది. నిజానికి తనకు ఎటువంటి సౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులు లేకపోగా కొన్ని అనారోగ్య కారణాల వల్ల తనకు సర్జరీ జరిగింది.

ప్రియాంక చోప్రా:ఇంటర్‌ నేషనల్‌‌ స్టార్‌ ప్రియాంక చోప్రాది సైతం ప్లాస్టిక్‌ అందమే. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తన పెదవులకు సర్జరీ చేయించుకున్నారామె. ఈ సర్జరీ సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

అక్కినేని సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని. తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమెకు కూడా 2012లో ముక్కు సర్జరీ జరిగింది. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా తర్వాత సమంత లుక్ ను చూసి షాక్ అయ్యారు. ఇక చాలా మంది అభిమానులు సమంత ఇప్పుడు కంటే అప్పుడే బాగుందని అన్నారు.

శిల్పా శెట్టి: బాలీవుడ్‌ ఎగుమతి చేసుకున్న దక్షిణాది అందం శిల్పా శెట్టి. ‘బాజిగర్’‌ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఈమె కూడా తన అందానికి మెరుగులు దిద్దుకోవటానికి కత్తికి పని చెప్పారు. బాలీవుడ్‌ ఎంట్రీకి ముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు.

కాజల్ అగర్వాల్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగుతోపాటు తమిళం, హిందీలో కూడా నటించింది. మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కాజల్ కి తన ముఖంలో కొన్ని లోపాలవల్ల మైనర్ సర్జరీ జరిగింది. ఇక తన ముక్కుకు కూడా అమెరికాలో సర్జరీ చేయించుకుంది.

అనుష్క శర్మ:‘రబ్‌ నే బనాది జోడీ’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన దక్షిణాది ముద్దు గుమ్మ అనుష్క శర్మ. మొదటి చిత్రంతోనే షారుఖ్‌ వంటి అగ్ర తార సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ‘బాంబే వెల్‌వెట్‌ ’ సినిమా సమయంలో అనుష్క తన పెదవులకు సర్జరీ చేయించుకోవటం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా‌ మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news