Moviesనితిన్ ' త‌మ్ముడు ' తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్...

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న హీరో నితిన్ కు దిల్, శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు ఎస్విసి బ్యానర్లో మూడో చిత్రం. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లోనే మూడు సినిమాలు చేసిన వేణు శ్రీరామ్ ఈ తమ్ముడు చిత్రానికి దర్శకత్వం వహించారు. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, శ్వాసిక విజయన్ కీలక పాత్రలు పోషించారు.బేసికల్ గా ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కథే అయినా దర్శకుడు శ్రీరామ్ వేణు కథనానికి కొత్తగా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు కానీ ఇక్కడ అదే లోపించింది.. పేరుకి అక్కా తమ్ముళ్ల సినిమా అయినా, బోలెడన్ని భావోద్వేగాలు పండించడానికి అవకాశం ఉన్నా ఎక్కడా ఎమోషనల్ కెనెక్టీవిటి ఉండదు.సినిమా ఎక్కువ శాతం అడవిలో జరగటం వల్ల యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువయ్యాయి. పోనీ అవైనా సరిగ్గా డిజైన్ చేసుకున్నారా అంటే అదీ లేదు.ఈ సినిమాలో విలన్ గా సౌరబ్ సచ్దేవ్, గిరిజన యువతిగా శ్వాసిక విజయన్ కనిపిస్తుంది. సినిమాలో వీరిద్దరి పాత్రలను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇదే శ్రద్ధ కథనం మీద కనబరిస్తే చాలా బాగుండేది.మొత్తానికి ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు.హీరో నితిన్ చేయడానికి ఏమీ లేదు. హీరోయిన్ సప్తమి గౌడ ట్రాక్ బాగా ఇబ్బంది పెట్టింది. ఈ మధ్యకాలంలో అదీ దిల్రాజు బేనర్లో ఇంతటి పూర్ రైటింగ్ ఎప్పుడూ చూడలేదు.దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్-అడ్వెంచర్ చేయాలని ఫారెస్ట్ సెటప్ తో ఏదో చేసేయాలని ఇంకేదో తీసినట్టు అనిపిస్తుంది. ఎటొచ్చీ అంజనీష్ లోకనాధ్ బీజీఎమ్ బాగుంది. సినిమాకు మరో ప్రధానమైన పిల్లర్ గా అజనీశ్ లోక్నాథ్ నేపథ్య సంగీతం కనిపిస్తుంది.Thammudu Movie First Review: తమ్ముడు మూవీ ఫస్ట్ రివ్యూ | Thammudu Movie  Review by Censor Board: Nithiin's Action, Sentiment drama gets CBFC's A  Certificate - Telugu Filmibeatసాధ్యమైనంత వరకూ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి ట్రై చేశాడు.గుహన్ కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. ఫారెస్టు లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. VFX అక్కడక్కడా నాసిరకంగా ఉన్నా, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాలో ఆకట్టుకున్న అంశాల కంటే కూడా డిసప్పాయింట్ చేసిన అంశాలే ఎక్కువ.చివరగా తమ్ముడు సినిమా చూసిన తరువాత దర్శకుడి గత చిత్రాలు ఎంసీఏ, వకీల్ సాబ్‌లే చాలా బెటర్ అనిపిస్తాయి.

– గరగ త్రినాథ్ రావు
సీనియర్ జర్నలిస్ట్

Latest news