టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. టాలీవుడ్‌లో ఆరేడు దశాబ్దాలుగా అక్కినేని ఫ్యామిలీ కొనసాగుతూ వస్తోంది. ఈ ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున స్టార్ హీరో అయ్యారు. ఇక ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మూడో తరంలోనూ నాగార్జున ఇద్దరు వారసులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరూ కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇక ఇటీవలే అక్కినేని నాచైతన్య వివాహం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అఖిల్ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిగింది. అఖిల్ పెళ్లిపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జూన్ 6 తెల్లవారు జామున 3 గంటలకి ఈ పెళ్లి అత్యంత వైభవోపేతంగా జరిగింది. నూతన వధూవరులు అఖిల్ ఇంకా జైనాబ్ లు వేద మంత్రాలు సాక్షిగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
అక్కినేని నాగార్జున స్వగృహంలోనే ఈ పెళ్లి అత్యంత వైభోవేపేతంగా జరగడం విశేషం. చిరంజీవితో పాటు రామ్‌చరణ్ దంపతులు.. పలువురు రాజకీయ నాయకులు.. సినీ తారలు.. వ్యాపారవేత్తలు ఈ పెళ్లికి హాజరై కొత్త జంటకు తమ ఆశీస్సులు అందించారు. ఈ ఆదివారం గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేయగా.. ఈ కార్యక్రమం మరింత ధూమ్‌ధామ్‌గా జరగనుంది.
అఖిల్ పెళ్లితో అక్కినేని ఫ్యామిలీలో సంబరాలు చూశారా…!
