Moviesప‌వ‌న్ ఆ ఒక్క సినిమా చేసుంటే పొలిటిక‌ల్ ఎంట్రీ ఉండేదే కాదా..?

ప‌వ‌న్ ఆ ఒక్క సినిమా చేసుంటే పొలిటిక‌ల్ ఎంట్రీ ఉండేదే కాదా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు.. అటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీ ఉప ముఖ్య‌మంత్రిగా ఉంటూనే అటు పొలిటిక‌ల్‌గా చ‌క‌చ‌కా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప‌వ‌న్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతుంది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్‌లో ఓజీ ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ప‌వ‌న్ త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో జానీ సినిమా కూడా చేశారు.ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఓ సినిమా చేసి ఉంటే రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వాడే కాద‌ట‌. ఈ విష‌యాన్ని వీర‌మ‌ల్లు నిర్మాత ఏఎం. ర‌త్నం తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. తాను నిర్మాత‌గా ప‌వ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలోనే స‌త్యాగ్రహి సినిమా ప్రారంభ‌మైన మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఈ సినిమా చేసి హిట్ అయ్యి ఉంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వాడినే కాద‌ని ప‌వ‌న్ చెప్పార‌ట‌. ఇది పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో చేయాల‌ని అనుకున్నా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

Latest news