హరి హర వీరమల్లు … చాలా కాలం తరవాత పవన్ కల్యాణ్ సినిమా తెరపైకొస్తోంది. పైగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతోన్న పవన్ తొఇ సినిమా కావడంతో జనసేన, పవన్ అభిమానులకే కాదు.. కూటమి ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగే. పైగా ఈ జోనర్లో పవన్ చేస్తోన్న ఫస్ట్ సినిమా. అయితే ఈ సినిమా రేట్లు చాలా ఎక్కువుగా ఉన్నాయని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నైజాంలో ఈ సినిమాకు రూ.60 కోట్లు కోడ్ చేశారు. ఈస్ట్ రైట్స్ అడిగితే రూ.13 కోట్లు అన్నారట. వైజాగ్ కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువే అంటున్నారు.పవన్ కల్యాణ్ సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండడంతో అది వేరే లెవల్. అయితే ఈ సినిమా నిర్మాణం కూడా ఆలస్యమైంది. వడ్డీలు పెరిగిపోయాయి. అవన్నీ తిరిగి రాబట్టాలంటే భారీ రేట్లకు అమ్ముకోవాల్సిందే. పవన్ ఇమేజ్‌పై నమ్మకం ఉన్న బయ్యర్లు ఎక్కువ రేట్లపై ఆసక్తి ఉన్నా లోపల వాళ్లకు చిన్న పాటి సందేహాలు ఉన్నాయట. అయితే సినిమాకు హిట్ టాక్ వస్తే మంచి లాభాలే వస్తాయి.
వీరమల్లు ట్రైలర్ ఇంకా బయటకు రాలేదు. ఫైనల్ కట్ రెడీ అవుతోంది. 5, 6 తేదీల్లో ట్రైలర్ అంటున్నారు. ట్రైలర్ వచ్చాక సినిమాపై మరింత నమ్మకం పెరుగుతుంది. ఆ తర్వాత డీల్స్ అన్నీ వరుసపెట్టి క్లోజ్ అవుతాయి.
వీరమల్లు క్రేజ్… రేట్లు భయపెడుతున్నాయా…?
