అల్లు అర్జున్ .. బన్నీ.. స్టైలిష్ స్టార్.. ఐకాన్ హీరో .. ఇలా ఒకటా రెండా.. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బన్నీ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. అల్లు అర్జున్ తాజాగా పుష్ప2 సినిమా షూట్ లో నటిస్తున్నాడు . పుష్ప సినిమాలో నటించి ఉత్తమ జాతియ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2022/11/saami_saami_pushpa_song-1024x768.jpg)
నిజానికి ఈ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు బన్నీకి ఎప్పుడో వచ్చి ఉండాల్సింది అంటున్నారు అభిమానులు. గతంలో అల్లు అర్జున్ అలాంటి హై రేంజ్ పెర్ఫార్మెన్స్ చాలా సినిమాల్లో చూపించాడు అని .. బన్నీ – ఆర్య – ఆర్య 2 -జూలాయి లాంటి సినిమాలలో ప్రాణం పెట్టినటించాడు అని.. కానీ ఆయనకు ఆ సినిమాలు హిట్ ఇచ్చాయే కానీ అవార్డు తెచ్చిపెట్టలేకపోయాయి అని చెప్పుకొస్తున్నారు .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2022/11/pushpa-will-srivalli-die-in-pushpa-b4f03a5d-5e6c-4255-a198-a2800274b5ba-415x250-1.jpg)
అంతేకాదు బన్నీ తెలిసి తెలియక కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కారణంగానే ఆ సినిమాలు అంత పెద్ద హైలెట్ కాలేకపోయాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ పేరిట బన్నీ నమ్మి మోసపోయాడు అని .. అందుకే పలువురు డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి చెత్త కథతో ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్నాడు అని .. అలా ఫ్రెండ్షిప్ ను గుడ్డిగా నమ్మిన కారణంగానే అల్లు అర్జున్ ఉత్తమ జాతియ నటుడి అవార్డు అందుకోవడానికి ఇంత టైం తీసుకున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు . ఫైనల్లీ ఆ అవార్డు .. అల్లు అర్జున్ కే రాసి పెట్టింది ..కనుక ఆయనకే పుష్ప సినిమా ద్వారా లభించింది అని.. ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో అవార్డులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అల్లు అర్జున్ తీసుకొస్తాడు అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!