టాలీవుడ్‌లో స్టార్ హీరోలు, పెద్ద పెద్ద హీరోలను పక్కన పెట్టేస్తే.. కనీసం మిడిల్ రేంజ్ హీరోలు కూడా కాదు.. రెండు, మూడు హిట్లు కూడా సరిగా లేని హీరోలు కూడా రెమ్యునరేషన్లు పెంచేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నారు. మేం అడిగినంత ఇస్తేనే కాల్షీట్లు ఇస్తాం.. లేకపోతే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పెద్ద హీరోల్లో కొందరి రెమ్యునరేషన్లు రు. 70, 65, 50 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్లు ఉంటున్నాయి.
ఇక నాని లాంటి మిడిల్ రేంజ్ హీరోలే ఏకంగా రు. 25 కోట్ల రేంజ్లో డిమాండ్ చేస్తున్నారు. కొందరు హీరోల సినిమాలకు అస్సలు లాభాలే రావడం లేదు. మరి కొందరికి అస్సలు గత పది సినిమాలలో ఒకటి రెండు తప్పా పెద్దగా హిట్లు కూడా ఉండడం లేదు. అయినా కూడా వీరు రెమ్యునరేషన్ ప్రతి సినిమాకు పెంచుకుంటూ పోతున్నారు.
ఇక డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డకు వచ్చిన హిట్ ఒక్కటే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ లాంటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇది కాకుండా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సినిమాకు రు. 10 కోట్లు ఇస్తేనే చేస్తానని కండీషన్లు పెట్టేశాడట. ఇదే చాలా ఎక్కువ అనుకుంటే ఒకవేళ టిల్లు స్క్వేర్ సినిమా హిట్ అయితే ఇక సిద్ధు రెమ్యునరేషన్ ఎక్కడో ఉంటుందంటున్నారు.
అంటే ఓ సాధారణ నిర్మాత ఎవ్వరూ కూడా కనీసం మిడిల్ రేంజ్ హీరోలతో కూడా సినిమాలు తీసే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే అస్సలు హిట్లు లేకుండా ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తోన్న శర్వానంద్ కూడా ఒక్కో సినిమాకు రు. 10 కోట్ల ఛార్జ్ చేస్తున్నాడు. ఆ లెక్కన చూస్తే సిద్ధు బెటరే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.