Moviesరవితేజ టచ్ చేసి చూడు.. ఫైనల్ గా ఎంత బొక్క అంటే..మరో...

రవితేజ టచ్ చేసి చూడు.. ఫైనల్ గా ఎంత బొక్క అంటే..మరో భారీ డిజాస్టర్ !

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విక్రం సిరికొండ డైరక్షన్ లో వచ్చిన సినిమా టచ్ చేసి చూడు. రాజా ది గ్రేట్ హిట్ తో వరల్డ్ వైడ్ 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 9.73 కోట్లను మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చింది. వక్కతం వంశీ కథ అందించిన ఈ సినిమా రొటీన్ గా సాగింది. అయితే కథనంలో కూడా దర్శకుడు తన ప్రతిభ చూపించలేదు.

సినిమా దాదాపు 40 శాతం రిటర్న్స్ కూడా తీసుకురాలేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో 8.33 కోట్లను వసూళు చేయగా.. 10 కోట్ల లోపే ఫైనల్ కలక్షన్స్ ఆగిపోయాయి. మొత్తానికి ఈ ఇయర్ లో రవితేజకు డిజాస్టర్ గా టచ్ చేసి చూడు సినిమా మిగిలింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో రవితేజ కథల విషయంలో కాస్త జాగ్రత్తపడుతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమ అయినా హిట్ కొట్టి రవితేజను మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news