Gossips96 కోసం రాజుగారితో బన్నీ ఫైట్..!

96 కోసం రాజుగారితో బన్నీ ఫైట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎవరితో అనేది ఇంకా ఫిక్స్ కాలేదనుకోండి. కాగా ఇటీవల రిలీజ్ అయిన టాక్సీవాలా చిత్ర ప్రమోషన్స్‌లో బన్నీ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో తెగ హల్‌చల్ చేస్తోంది. బన్నీకి ఒక ఇటీవల రిలీజ్ అయిన తమిళ చిత్రం 96 భీబత్సంగా నచ్చేసిందట.

ఇంకేముంది.. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి బన్నీ రెడీ అవుతున్నాడట. కాగా ఆ చిత్ర తెలుగు రీమేక్ రైట్స్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందే కొనేశాడు. అయితే ఈ సినిమాను ప్రత్యేకంగా నేచురల్ స్టార్ నాని, బన్నీ ఇద్దరికీ చూపించాడట. అయితే ఇందులో హీరో కొంచెం వయసు పెరిగిన వాడిలా ఉండాలి కాబట్టి వీరిద్దరూ ఆ సినిమాకు సెట్ అవ్వరు. కాగా బన్నీ ఈ సినిమాను తనే స్వయంగా ప్రొడ్యూస్ చేయాలిన ఆలోచిస్తున్నాడు. ప్రొడక్షన్‌లోకి బన్నీ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడట. అందుకే ఇలాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తన తొలిసినిమా అయితే బాగుంటుందని బన్నీ దాని తెలుగు రైట్స్‌ను తనకు ఇవ్వాలని దిల్ రాజును అడిగేశాడు. కాగా దిల్ రాజు కొంచెం టైమ్ అడిగాడట.

మరి బన్నీ కోరికను దిల్ రాజు నెరవేరుస్తాడా లేక ఆ సినిమాను వేరేవారితో తానే నిర్మిస్తాడా అనేది చూడాలి. బన్నీకి నచ్చిన సినిమాలో హీరోగా కాకపోయిన నిర్మాతగా ఉండాలని చూస్తున్నాడు. మరి తెలుగు 96 చివరికి ఎవరి చేతిలో ప్రొడ్యూస్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news