యూట్యూబ్ ను షేక్ చేస్తున్న90 ఎం.ఎల్ ట్రైలర్

90ML trailer

కోలీవుడ్ లో ఓ ట్రైలర్ రిలీజైంది.. ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్ లో అదరగొట్టిన ఓవియా ఈ సినిమాలో నటించడమే క్రేజ్ కాగా ఇక నిండా బూతులతో నిండిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. 90 ఎం.ఎల్ అంటూ వచ్చిన ఈ ట్రైలర్ బూతు డైలాగులు.. అడల్ట్ సన్నివేశాలు అబ్బో బూతు అనడం కన్నా దన్ని మించిన పదం ఏదైనా ఉంది అంటే దీనికి పర్ఫెక్ట్ సూట్ అవుతుందని చెప్పాలి.

ఓవియా తో పాటుగా తన ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం మందు తాగడం ఎంజాయ్ చేయడం ఎవరి అనుభవాలు వారు చెప్పడం అబ్బో అడల్ట్ పేరుతో ఈ 90 ఎం.ఎల్ సినిమా చిన్నపాటి బీ గ్రేడ్ అటెంప్ట్ చేశారని చెప్పాలి. ఈ ట్రైలర్ కు కోలీవుడ్ లో మిశ్రమ స్పందన వచ్చింది. బిగ్ బాస్ వల్ల ఓవియా క్రేజ్ తెచ్చుకోగా ఆ పాపులారిటీ ఇప్పుడు ఈ ట్రైలర్ వల్ల పోయిందని కొందరు అంటుంటే కొందరు మాత్రం ఆమె క్రేజ్ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఓరివ్యా చేస్తున్న ఈ హాట్ అటెంప్ట్ ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా రెండు రోజుల్లోనే 4 . 8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

Leave a comment