9 వ తరగతి విద్యార్థిని పై ఉన్మాదిలా మారిన ఉపాద్యాయుడు…

34

పాఠాలు చెప్పే ఉపాద్యాయుడే కీచకుడిగా మారితే ఎలా ఉంటుంది. ఈ దేశంలో మహిళలకు రక్షణగా ఎన్ని చట్టాలు, కఠిన శిక్షలను ప్రవేశ పెడుతున్నా మనిషి మాత్రం మృగాలుగా మారుతున్నాడు. ఉపాద్యాయ వృత్తిలో ఉండి ఓ స్టూడెంట్ పై కన్నేసిన ఓ టీచర్ ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో బిఎడ్ పూర్తి చేసిన కర్నూలులో వాలెంటీర్ ప్రతిపాదనలో హింది పండిట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి 9వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద కన్నేశాడు.
2
ఆమె ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్న అతను ఆ అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడట. అంతేకాదు ఓరోజు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు ఎవరు లేరని గమనించిన అతను ఆమె ఇంటికి వెళ్లి బలవంతం చేయబోయాడట. అతను తనతో ఓ కత్తిని కూడా తీసుకెళ్లాడట. ఆమె మీద కత్తితో గాట్లు కూడా పెట్టాడట ఇంతలోనే ఆ అమ్మాయి గట్టిగా కేకలేయడంతో అతను కూడా కత్తితో పొడుచుకున్నాడట.

ఇద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్లారని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి పరిస్థితి బాగానే ఉందట. ఇక ఆ టీచర్ మీద ఇప్పటికే కేసు పెట్టగా పోలీసుల ఆదీనంలోనే అతనికి ట్రీట్ మెంట్ జరుగుతుందట. అతను కోలుకోగానే అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్తారని తెలుస్తుంది.

Leave a comment