Newsఒక పేజీ జిరాక్స్ చేయించుకుంటే 750 రూపాయిలు.. ఎక్కడో తెలుసా?

ఒక పేజీ జిరాక్స్ చేయించుకుంటే 750 రూపాయిలు.. ఎక్కడో తెలుసా?

75 rupees for one page xerox in railway department.

మనం సాధారణంగా ఒక పేపర్‌ని ఏదైనా జిరాక్స్ షాపులో జిరాక్స్ కాపీ తీయించుకుంటే.. దానికి 1 లేదా 2 రూపాయలు చెల్లిస్తాం. అంతే.. అంతకంటే ఎక్కువ రేటు ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉన్నా.. గొడవపడిమరీ తగ్గించుకుంటాం. కానీ.. ఒక్క చోట మాత్రం ఎంత గింజుకున్నా సరే, ఒక్క పేజీ జిరాక్స్ చేయించుకుంటే దానికి 750 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అవును.. మీరు చదువుతోంది నిజమే. ఒక పేజీ జిరాక్స్ కాపీకి 750 వెల కట్టాల్సిందే.

సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం కింద రైల్వే డిపార్ట్‌మెంట్‌ను వివరాలు కోరితే.. ఒక్క పేజీ జిరాక్స్ కోసం వాళ్లు 750 రూపాయలు వసూలు చేస్తారు. ఎప్పటినుంచో అమలులో ఉన్న దీనిని.. అంత రేటు తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే.. సమాచార కమిషన్ వాటిని పెడచెవిన పెట్టాయి. దాంతో.. రైల్వే వారు ప్రతి పేజీకి 750 రూపాయలు లాగేవారు. ఇప్పుడు అభ్యంతరాలు మరింత ఎక్కువవడంతో.. అంత మొత్తం తీసుకోవడం ఆపేయాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఆర్‌టీఐ నిబంధనలకు లోబడి పేజీకి రూ.2 మాత్రమే తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

రాయ్‌పూర్‌వాసి ప్రశాంత్‌ కాటెల.. ఒక్క జిరాక్స్ కాపీకి రైల్వేవారు రూ.750 వసూలు చేయడంపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును విచారిస్తూ.. ముఖ్య సమాచార కమిషనర్‌ రాధాకృష్ణ మాథుర్‌ ఆ వెలని 2 రూపాయలకి తగ్గిస్తూ ఈ ఆదేశాలిచ్చారు. టిక్కెట్టుతో ప్రయాణించిన వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికుల ట్రావల్ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా రైల్వేను ప్రశాంత్‌ కోరగా.. పేజీకి రూ. 750 చెల్లించాలని కోరారు. దాంతో ఖంగుతిన్న అతను.. అప్పీలెట్‌ అథారిటీని ఆశ్రయించాడు. దీంతో కేంద్ర సమాచార కమిషన్‌‌కు వెళ్లాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news