Gossipsఎన్టీఆర్ బయోపిక్ నాలుగోది వస్తోంది

ఎన్టీఆర్ బయోపిక్ నాలుగోది వస్తోంది

ఏదైనా ఒక ఫార్ములా ఫేమస్ అయితే చాలు అందరూ అదే ఫాలో అయిపోతారు. ఇది అన్ని చోట్లా సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము. అలాగే ఈ మధ్య తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో బాగా పాపులర్ అయిన అంశం ఏదైనా ఉందా అంటే అది ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విశేషాలే. ఈ సినిమాలో మెయిన్ పాత్ర ఒక్కేటే అయినప్పటికీ ఈ సినిమాను బేస్ చేసుకుని నాలుగైదు సినిమాలు తీసేందుకు పోటీలు పడుతున్నారు. ఎవరు ఏ కోణం లో ఎన్టీఆర్ ను చూపించినా చివరకు అన్ని సినిమాల్లోనూ ఆయన జీవిత కథ చుట్టూనే అన్ని సినిమాలూ తిరగనున్నాయి.

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ, నందమూరి బాలకృష్ణ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తుమ్మలపల్లి సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని సినిమా చేసేందుకు పోటీలు పడుతున్నారు. నందమూరి తారక రామారావు జీవిత గాథతో సినిమా తీస్తామని ఇప్పటికే ముగ్గురు బహిరంగంగానే  ప్రకటించారు. తాజాగా మరో ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ పై సినిమా తీయడానికి రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ లోని లేటెస్ట్ న్యూస్.

ఎన్టీఆర్ తనయుడు – హీరో బాలకృష్ణ లీడ్ రోల్ లో డైరెక్టర్ తేజ ఎన్టీఆర్ జీవితగాథ సినిమా తీయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయబోతున్నట్టు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేశాడు. కొద్దిరోజుల క్రితం కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రామ్ గోపాల్ వర్మ కాన్సెప్ట్ కు వ్యతిరేకంగా వీరగ్రంథం అనే సినిమా తీస్తానని ప్రకటించాడు.

ఈ వ్యవహారాలన్నీ ఎటూ తేలకుండా అలాగే ఉన్నాతాజాగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అనే నిర్మాత కూడా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కొన్ని తమిళ సినిమాలు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన వ్యక్తి. ఇంతవరకు స్టార్ హీరోలతో సినిమాలేం చేయలేదు. మరి ఈయన సినిమా తీయాలని అనుకోవడమే తప్ప ఎవరిని లీడ్ క్యారెక్టర్లలో తీసుకుంటారు.. ఎన్టీఆర్ జీవితంలో ఏ ఎపిసోడ్లతో సినిమా తీస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద ఎన్టీఆర్ జీవితంతో బయోపిక్ లు తీయడానికి గట్టి పోటీయే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news