హీటెక్కిస్తున్న హెబ్బ పటేల్ 24 కిస్సెస్ టీజర్..!

16

కుమారి 21ఎఫ్ సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన హెబ్భా పటేల్ ఆ తర్వాత కూడా కొన్నాళ్లు అదే ఫాం కొనసాగించగా ఆ తర్వాత కాస్త వెనుకపడ్డది. ప్రస్తుతం అమ్మడు చేస్తున్న సినిమా 24 కిస్సెస్. అయోధ్య కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది. 24 కిస్సెస్.. టైటిల్ కు తగినట్టుగానే 24 కిస్సులు సినిమాలో ఉంటాయని తెలుస్తుంది.

రెండు గంటల సినిమాలో 24 కిస్సులు అంటే దాదాపు ఇక సినిమా మొత్తం కిస్సులాటే ఉంటుందని చెప్పొచ్చు. హెబ్భా ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ చేసుకునేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్ లో కూడా అదరచుంభనాలతో అదరగొట్టారు. ఈమధ్య యూత్ టార్గెట్ తో వస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుండగా కిస్సులతో కేక పెట్టిస్తున్న ఈ 24 కిస్సెస్ సినిమా కూడా యువతను పరుగులు తీసేలా చేస్తుందని చెప్పొచ్చు.

Leave a comment