Moviesప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో)
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్)
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
విడుదల తేదీ: ఆగస్టు 14, 2025Coolie Movie Preview: Rajinikanth's Diamond Jubilee Honored with Iconic  Title Card as Lokesh Kanagaraj's Explosive Union Set to Ignite the Big  Screen - Sacnilk

కథ 🎬✒️
చెన్నైలోని మెన్ మాన్షన్ ను నడిపే దేవ (రజినీకాంత్) తన సన్నిహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) మృతితో తీవ్ర విషాదంలో ఉంటాడు. కానీ రాజశేఖర్ మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంటుంది.
విశాఖపట్నం పోర్ట్‌ను నియంత్రించే సైమన్ (నాగార్జున) ఒక శక్తివంతమైన డాన్, ఖరీదైన వాచ్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్మగ్లింగ్‌తో పాటు అక్రమ వ్యాపారం చేస్తుంటాడు. అతని కింద దయాల్ (సౌబిన్ షాహిర్) ఈ కార్యకలాపాలను నిర్వహిస్తాడు. ఈ నేర సామ్రాజ్యంలో పనిచేసే రాజశేఖర్ ఒక రోజు హత్యకు గురవుతాడు. రాజశేఖర్ హత్య వెనుక ఉన్న నిజం తెలుసుకునేందుకు అతని సన్నిహిత మిత్రుడు దేవా వైజాగ్‌కు వస్తాడు. సైమన్ ముఠాతో దేవా ఎలా పోరాడాడు? రాజశేఖర్ కూతురు ప్రీతి (శ్రుతి హాసన్), కాళేశ్ (ఉపేంద్ర), దాహా (ఆమిర్ ఖాన్)ల పాత్రలు ఏమిటి? అనేది మిగతా కథ.

Rajinikanth's 'Coolie' shatters records, earns Rs 100 crore in advance  bookings, becomes the biggest opening for an Indian movie through  pre-release sales, beating Ram Charan's 'Game Changer' | Tamil Movie News -

విశ్లేషణ ✒️
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ నటనతో భారీ అంచనాలతో విడుదలైన కూలీ ఒక వైపు రజనీకాంత్ అభిమానులకు స్టైలిష్ యాక్షన్ విందుగా నిలిచింది. కానీ కథ, స్క్రీన్‌ప్లేలో సాగదీతతో నిరాశపరిచింది. లోకేష్ కనగరాజ్ సినిమాలకు సిగ్నేచర్‌గా నిలిచే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్ట్‌లు ఈ చిత్రంలో అంతగా కనిపించవు, ఫలితంగా సినిమా సాధారణ రివేంజ్ డ్రామాగా మిగిలిపోయింది.

🟢 బలాలు: 👍👍
రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్: రజనీకాంత్ తన విలక్షణ స్టైల్, స్వాగ్‌తో సినిమాను ఒక్కడే మోస్తాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బీడీ తాగే సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఇంట్రో సాంగ్, మేన్షన్ హౌస్ ఫైట్ సీన్‌లు థియేటర్‌లో విజిల్స్ వేయిస్తాయి.
నాగార్జున విలనిజం: తొలిసారి పూర్తిస్థాయి విలన్‌గా నాగార్జున ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ బ్లాక్‌లో అతని పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది, అయితే సెకండ్ హాఫ్‌లో పాత్ర బలహీనంగా మారడం నిరాశపరిచింది.
అనిరుధ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. మోనికా సాంగ్, రజనీ ఇంట్రో సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేస్తాయి. అయితే… జైలర్ అంత గొప్పగా లేదు.
సాంకేతిక నైపుణ్యం: గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి.Rs 3310 crore net worth: Meet the richest actor of Coolie movie

🔴 బలహీనతలు : 👎👎
సాగదీత కథనం: సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది, సెకండ్ హాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఊపందుకున్నప్పటికీ, మొత్తం కథనం రొటీన్ రివేంజ్ డ్రామాగా అనిపిస్తుంది. లోకేష్ సినిమాలకు ఉండే థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, డెప్త్ ఈ చిత్రంలో కొరవడ్డాయి.
అండర్‌యూటిలైజ్డ్ స్టార్ కాస్ట్: ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ వంటి స్టార్ నటులకు బలమైన పాత్రలు లేకపోవడం నిరాశపరిచింది. ఆమిర్ ఖాన్ కామియో, లోకేష్ గత చిత్రం విక్రమ్లో రోలెక్స్ పాత్ర స్థాయిని అందుకోలేకపోయింది.
ఊహించదగిన కథ: సినిమా కథ ప్రిడిక్టబుల్‌గా ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో లింక్ ఉంటుందన్న అంచనాలు నిజం కాలేదు, ఇది కొంతమంది అభిమానులకు నిరాశను కలిగిస్తుంది.
ఎమోషనల్ డెప్త్ లోపం: రజనీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాటల్లోనే సరిపెట్టడం, రాజశేఖర్-దేవా స్నేహ బంధానికి లోతైన ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం సినిమాకు మైనస్‌గా నిలిచింది.

నటీనటులు: 🎭🥷
రజనీకాంత్: తన స్టైల్, యాక్షన్‌తో సినిమాను నడిపించాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వింటేజ్ రజనీ లుక్ అభిమానులకు పండగ.
నాగార్జున: సైమన్ పాత్రలో స్టైలిష్ విలన్‌గా మెప్పించాడు, కానీ పాత్రకు డెప్త్ లేకపోవడం వల్ల ఫస్ట్ అటెంప్ట్ లో దక్కాల్సిన గుర్తింపు నాగ్ దక్కకపోవచ్చు.
సౌబిన్ షాహిర్: దయాల్ పాత్రలో వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు. మోనికా సాంగ్‌లో అతని డ్యాన్స్ హైలైట్.
శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్: ఈ పాత్రలు సినిమాకు ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో సఫలమైనప్పటికీ, పరిమిత స్కోప్ కారణంగా పెద్దగా గుర్తుండవు.
ఆమిర్ ఖాన్: క్లైమాక్స్‌లో దాహా పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ, రోలెక్స్ స్థాయి ఎలివేషన్ లేకపోవడం నిరాశపరిచింది.Coolie review. Coolie Telugu movie review, story, rating - IndiaGlitz.com

సాంకేతిక అంశాలు:🎵🎥🎞️
గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ విజాగ్ పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌ను ఆకర్షణీయంగా చూపించింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో, సినిమాకు బలం. ఎడిటింగ్‌లో ఫస్ట్ హాఫ్‌లో సాగదీతను తగ్గించి ఉంటే బాగుండేది.

✒️ తీర్పు: ✒️
కూలీ రజనీకాంత్ అభిమానులకు స్టైలిష్ యాక్షన్, వింటేజ్ స్వాగ్‌తో కన్నుల పండగను అందిస్తుంది, కానీ లోకేష్ కనగరాజ్ మార్క్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు పై ఆశ పెట్టుకుని పోతే… నిరాశే దిక్కు. రజనీ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఒకసారి చూడదగిన ఎంటర్‌టైనర్, కానీ లోకేష్ సినిమాల స్థాయి థ్రిల్ ఆశించే వారికి నిరాశ తప్పదు.Rajinikanth Fan? Know How To Book Coolie Movie Tickets Online - Oneindia  News

🟢 ప్రకాష్ చిమ్మల వర్డ్ : రజనీ ఫ్యాన్స్ కోసమే… లోకేష్ ఫ్యాన్స్ కోసం కాదు !!

⭐ రేటింగ్ : 2.75/5

Latest news