పాపం.. కమల్ హాసన్ అనుకోవాలి.. ఇటీవల కాలంలో ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. భారతీయుడు తర్వాత 30 ఏళ్లు గ్యాప్ తీసుకుని … భారతీయుడు 2 చేస్తే అతి పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కు కమల్ కెరీర్ లో ఎప్పుడూ .. ఏ సినిమాకు జరగనంత ట్రోలింగ్ జరిగింది. ఆ చేదు జ్ఞాపకాలు మర్చి పోకుండానే భారతీయుడు 3 సినిమా అన్నారు.. అది కూడా రాలేదు. ఇక ఇప్పుడు మరో కళాఖండం కమల్ నుంచి వచ్చింది .. అదే థగ్ లైఫ్. కమల్ – మణిరత్నం కాంబినేషన్ అంటేనే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో తెలిసిందే. పై గా నాయకుడు సినిమా వచ్చాక 38 ఏళ్లకు కమల్ – మణి కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. కమల్ , శింబు, త్రిష , అభిరామి ఇలా భారీ తారగణం తో పాటు మణిరత్నం డైరెక్షన్ .. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ ఎన్ని ఉన్నా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే మ్యాజిక్ చేయలేకపోయింది.థగ్ లైఫ్ సినిమా పరమ చెత్త డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు దరిద్రమైన రికార్డులు మూట కట్టుకుంటోంది. బుక్ మై షోలో.. అత్యల్ప రేటింగ్ అందుకొన్న చెత్త రికార్డు కూడా థగ్ లైఫ్ సొంతం చేసుకుంది. మణిరత్నం వీరాభిమానులు సైతం ఇదేం సినిమా రా బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంలో మణిరత్నం ను పూర్తిగా తప్పు పట్టాల్సిన పనిలేదు. స్క్రిఫ్ట్ విషయంలో కమల్ పాత్ర కూడా ఉంది. ఆయనే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశారు. కథ ఇలాంటిది ఎంచుకుని .. కథనం విషయంలో వేలు పెట్టడం కూడా చేసిన పెద్ద తప్పు. మణితర్నం ఈ తరం జనరేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమా తీయలేదు… కమల్ కూడా అప్డేట్ కావడం లేదు. రెహ్మన్ మ్యూజిక్ బాగోలేదు. త్రిష పాత్ర తేలిపోయింది. ఇవన్నీ కలిసి ఈ సినిమాను నిలువునా ముంచేశాయి.
థగ్ లైఫ్ ను నిలువునా ముంచేసిందెవరు… ?
