యూనివర్సల్ హీరో కమలహాసన్ హీరోగా త్రిష , అభిరామి హీరోయిన్లుగా సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుండగా పలు షాకింగ్ కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంటుంది. మరీ ముఖ్యంగా కన్నడ రిలీజ్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ రిలీజ్ కి అడ్డుకట్ట వేసాయి. కన్నడలో బ్యాన్ అయిన ఈ సినిమాకి అక్కడ విడుదల కాకపోవటం వల్ల రు. 15 కోట్లు నష్టం వచ్చు వచ్చినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.ఒక వారం తర్వాత అక్కడ రిలీజ్ ఉంటుందని కూడా టాక్ వచ్చినా ఇప్పటిలో అదేమీ సాధ్యమయ్యే పరిస్థితి కూడా లేదట. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా… తమిళ హీరో శింబు కీలకపాత్రలో నటించారు. కమల్ – ఆర్ మహేంద్రన్ నిర్మాణ సారథ్యం వహించారు. దశాబ్దాల తర్వాత కమలహాసన్ – మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
కన్నడలో ‘ థగ్ లైఫ్ ‘ రిలీజ్ లేదు… కమల్ సినిమాకు ఎన్ని కోట్లు బొక్కో తెలుసా…!
