రకరకాల మీమ్స్ ను సోషల్ మీడియా నుంచి సేకరించి దానికి మల్లీశ్వరి సినిమాను హలో బ్రదర్ ఫ్లేవర్ ను మిక్స్ చేసి తయారుచేసిన బురబుర పొంగే సమ్మర్ లెమన్ సోడా లాంటి మూవీ ఇది. సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
#single movie Review చూద్దాం… 😍
సినిమా: సింగిల్ విడుదల తేదీ: మే 2025
దర్శకుడు: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి
నటీనటులు: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: నవీన్ నూలి
రన్‌టైమ్: 2 గంటల 10 నిమిషాలు
జానర్: రొమాంటిక్ కామెడీ
🎞️కథ:
విజయ్ (శ్రీ విష్ణు) ఒక బ్యాంకు ఉద్యోగి. వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. ఏ అమ్మాయి తనకు దొరకలేదని… అనుకుంటున్న సమయంలో అతడి జీవితంలోకి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒకరు విజయ్ కి ఇష్టమైన పూర్వ (కేతిక శర్మ).. మరొకరు విజయ్ ని ఇష్టపడే హరిణి (ఇవానా). హరణిని వదలించుకుని పూర్వను మెప్పించడానికి నానా యాతన పడుతుంటాడు. ఈ ఇద్దరమ్మాయిలతో తన ప్రేమాయణం చివరికి ఎవరితో సెట్ అయ్యింది అన్నది మిగతా కథ.🤣 హెవీ లోడెడ్ ఫన్ :
‘సింగిల్’ ఒక రొమాంటిక్ కామెడీ. నటీ నటులే హైలెట్. సినిమా మొత్తం మీమ్స్. ఫన్నీ లైనర్స్, సరసాలు, సరదాలు. శ్రీ విష్ణు సహజమైన నటనను, అతని కామెడీ టైమింగ్‌ను థియేటర్లలో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీమ్ డైలాగ్ లతో అతను పేల్చే పంచులు పడీ పడీ నవ్విస్తాయి. ఇదే సినిమాకు పెద్దబలం. “శ్రీ విష్ణు ఒక్కడే సినిమాను తన భుజాలపై మోసాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ సూపర్!” అని చెప్పాలి. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌తో అతని సీన్స్‌ను ప్రేక్షకులు హైలైట్. ఇద్దరి కెమిస్ట్రీ కడుపుబ్బా నవ్వించింది. “ఫస్ట్ హాఫ్ ఒక ఫన్నీ రైడ్, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. డైలాగ్స్, సిట్యుయేషన్స్ అన్నీ టాప్ నాచ్!” విట్టీ డైలాగ్స్ మరియు సిట్యుయేషనల్ కామెడీ సినిమాను ఎంగేజింగ్‌గా మార్చాయి. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమా. అసభ్యత లేని నవ్వులే ఎక్కువ. వైలెన్స్ లేకుండా, లైట్‌హార్టెడ్ గా ఉంది. సమ్మర్ సీజన్‌కు సరిగ్గా సరిపోయింది.
👍 ప్లస్ పాయింట్స్ :
శ్రీ విష్ణు నటన: శ్రీ విష్ణు ఈ సినిమాలో తన ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. విజయ్ పాత్రలో అతని సహజమైన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌తో అతని సీన్స్ సినిమాకు పెద్ద హైలైట్.
కామెడీ: సినిమా మొదటి భాగం పూర్తిగా నవ్వులే నవ్వులు. విట్టీ డైలాగులు, సిట్యుయేషనల్ కామెడీతో సినిమా ఫాస్ట్ గా అయిపోతుంది. వెన్నెల కిషోర్‌తో శ్రీ విష్ణు కెమిస్ట్రీ సూపర్బ్‌గా పనిచేసింది.
రన్‌టైమ్: 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్ సినిమాకు సరిపోయింది. కథ సాగదీత లేదు.
హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్: కేతిక శర్మ, ఇవానా ఇద్దరూ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. వారి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణను జోడించాయి.
క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్: ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు అనువైన క్లీన్ కామెడీని అందిస్తుంది. వైలెన్స్ లేకుండా, ఫన్‌తో నిండిన కథ ఈ సమ్మర్ సీజన్‌కు సరైన ఎంటర్‌టైనర్.
👎మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లాగ్: మొదటి భాగం అద్భుతంగా ఉన్నప్పటికీ, రెండో భాగం కొంత సాగదీతగా అనిపిస్తుంది. కథలో కొన్ని సీన్స్ అనవసరం అనిపిస్తాయి. కానీ మరీ ఇబ్బంది పెట్టే సీన్లేమీ లేవు. కాకపోతే సినిమా స్పీడ్ తగ్గుతుంది.
సాంగ్స్ అండ్ బీజీఎం: పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. పాటలు సాధారణంగా ఉన్నాయి, బీజీఎం కూడా ఆకట్టుకోలేదు.
క్లైమాక్స్: క్లైమాక్స్ కొంత ఊహించిన విధంగానే సాగుతుంది. ఇది సినిమాకు బలమైన ముగింపును ఇవ్వలేకపోయింది. అసలు ఇది మీమ్ సినిమా కాబట్టి మనం కూడా పెద్ద ఎక్స్ పెక్ట్ చేయం.
స్టోరీ డెప్త్: కథలో లోతైన ఎమోషనల్ కనెక్ట్ లేదు. ఇది పూర్తిగా కామెడీ డ్రామాగా మాత్రమే పనిచేస్తుంది, డీప్ స్టోరీ ఆశించే వారికి నిరాశ కలిగించవచ్చు.
🎥🎵🥷 సాంకేతిక అంశాలు :
దర్శకత్వం: కార్తీక్ రాజు తన మునుపటి చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ తర్వాత ఈ సినిమాతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించాడు. కామెడీ సీన్స్‌ను బాగా హ్యాండిల్ చేశాడు, కానీ రెండో భాగంలో కథను మరింత బలంగా నడిపించి ఉంటే బాగుండేది.
సినిమాటోగ్రఫీ: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ అప్పీల్‌ను ఇచ్చింది. రొమాంటిక్, కామెడీ సీన్స్‌ను బాగా క్యాప్చర్ చేశారు.
ఎడిటింగ్: ఎడిటింగ్ మొదటి భాగంలో శక్తివంతంగా ఉన్నప్పటికీ, రెండో భాగంలో కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది.
నిర్మాణ విలువలు: గీతా ఆర్ట్స్ బ్యాకింగ్‌తో సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సెట్స్, కాస్ట్యూమ్స్ సినిమా టోన్‌కు సరిపోయాయి.
✒️ రేటింగ్: 3/5
🔴 ప్రకాష్ చిమ్మల కామెంట్ : క్లీన్ ఫ్యామిలీ కామెడీ… Gen Z బ్యాచ్ స్టైల్లో తీసిన నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమా. అందులో కథ ఉంది. ఇందులో కామెడీ మాత్రమే ఉంది.