మెగాస్టార్ చిరంజీవికి అలాగే ఫాంటసీ జనరల్ సినిమాలకి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందని చెప్పాలి. ఈ జానర్ లో చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలకి తెలుగు ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. 35 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తెలుగు సినిమాకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాత మరోసారి 2004 సంక్రాంతి కనుక వచ్చిన అంజి సినిమాతో ఇలాంటి సినిమాలు కి మెగాస్టార్ అంటే ఢిల్లీ కాంబినేషన్ అన్నట్టుగా మారింది. తాజాగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను రిలీజ్ చేస్తే దానికి కూడా మళ్లీ సాలిడ్ రెస్పాన్స్ థియేటర్లలో నమోదు కావడం విశేషం.ఇలా ఈ రీ రిలీజ్ కూడా మంచి హిట్ కాగా మళ్లీ మెగాస్టార్ నుంచి రాబోతున్న అవైటెడ్ ఫాంటసీజానర్ సినిమా విశ్వంభరపై మళ్ళీ మంచి హైప్ నెలకొంది. ఇటీవల ఈ సినిమా టీజర్ గ్లింప్స్ పై కొన్ని నెగటివ్ కామెంట్లు వచ్చాయి. మెగాస్టార్ కి ఫాంటసీ జానర్ లో సరైన సినిమా పెడితే అవేవి పనిచేయవు. కానీ విశ్వంభర సినిమా కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే మళ్లీ మెగాఫ్యాన్స్ కి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ ఖాయం అని చెప్పాలి. మరి దర్శకుడు వశిష్ట ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించారో చూడాల్సి ఉంది.
మెగాస్టార్ విశ్వంభర మీద జగదేకవీరుడు రీ రిలీజ్ ఎఫెక్ట్ ..!
