టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేశారు. గత కొంత కాలంగా పవన్ సినిమాలు ముందుకు కదలకుండా ఉన్నాయి. ఇప్పుడు తన సినిమాలు స్పీడ్‌గా పూర్తి చేసేయాలని డిసైడ్ అవ్వడంతో చకచకా పూర్తి చేస్తున్నాడు. వీరమల్లు షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇక ఓజీ కి కూడా కొద్ది రోజులు షూటింగ్ చేస్తే ఆ సినిమా కూడా పూర్తవుతుంది. వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవుతుంటే.. ఓజీ దసరాకు రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతుంది.ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చకచకా ఈ యేడాదిలోనే పూర్తి చేయనున్నాడు. మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా రీమేక్ అంటూ జరిగిన ప్రచారంతో సినిమాపై నెగటివ్ టాక్ వచ్చింది. అయితే ఇది రీమేక్ కాదు.. ఒరిజినల్ స్టోరీ అని అంటున్నారు. దీంతో ఇప్పుడు సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఏదేమైనా పవన్ వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో మామూలు ఖుషీ లేదు.
పవర్‌స్టార్ ఉస్తాద్ భగత్‌సింగ్ పై కొత్త రూమర్… నమ్మొచ్చా…!
