Moviesమ‌హేష్ - రాజ‌మౌళి సినిమా పుకార్ల పుట్ట‌... మ‌రో షాకింగ్ న్యూస్...

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా పుకార్ల పుట్ట‌… మ‌రో షాకింగ్ న్యూస్ ఇది…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా అంటేనే పెద్ద పుకార్ల పుట్టగా మారిపోయింది. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార‌న్‌ ఉంటాడని చర్చ జోరుగా సాగింది.. చివరకు అదే నిజం అయింది. ఇప్పుడు మహేష్ – పృధ్వీరాజ్ కలిసి షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో సరికొత్త పుకారు ఈ సినిమా నుంచి బయటకు వచ్చింది. రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో తమిళ‌ సీనియర్ హీరో విక్రమ్ కూడా ఉన్నాడట. త్వరలోనే విక్రమ్ కూడా ఈ సినిమా సెట్స్ మీదకు వస్తాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇది కొత్త రూమర్ కాదు .. చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. గత ఆగస్టులో ఈ రూమ‌ర్ పై స్వయంగా విక్రమ్ స్పందించాడు.SSMB29 ముహూర్తం ఫిక్స్!- అఫీషియల్​ లాంఛింగ్ ఎప్పుడంటే?రాజమౌళి నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం భవిష్యత్తులో కచ్చితంగా రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా ఉంటుంది.. కాకపోతే మహేష్ బాబు సినిమా గురించి ఎప్పుడూ చర్చ జరగలేదని విక్రమ్ ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి స్టేట్మెంట్ పృధ్వీరాజ్ సుకుమారన్‌ నుంచి వచ్చింది. కట్ చేస్తే అతడు మహేష్ బాబు సినిమాలో భాగస్వామ్యం అయ్యాడు. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా అదే జరగబోతుంది అని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్ కాస్త విరామం ఇచ్చాడు. లండన్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఏది ఏమైనా మహేష్ బాబు – రాజమౌళి సినిమాపై రోజురోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

Latest news