పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ – క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమా రిలీజ్‌పై ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లాస్ట్ మినిట్‌లో థియేటర్ల మూసివేత ప్రచారంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? అవ్వదా ? అన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది.ఇక థియేటర్ల బంద్ విషయంలో మొన్న ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీట్ అంత సానుకూలంగా జరగకపోవడం అనేది మరో ట్విస్ట్ గా నిలిచింది. ఈ డ్రామా వెనుక ఒక నలుగురు నిర్మాతలు ఉన్నారని.. కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం బయటకు వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం … దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో కనుక్కోవాలి అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఇప్పుడు పరిస్థితులు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో వీరమల్లు సినిమాను టాలీవుడ్‌కు చెందిన ఆ నలుగురు పెద్దలు నిజంగానే ఉన్నారా ? వారి పాత్ర ఎంత వరకు ఉందనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ తీవ్రమైంది.
హరిహర వీరమల్లుకు కావాలనే అడ్డంకులు.. ఆ నలుగురి మీదే డౌట్..?
