రెబల్ స్టార్ ప్రభా ‘కల్కి 2898 ఏడీ’తో బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆ సినిమాలో ఇద్దరూ జంటగా కనిపించలేదు. అయితే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలోనూ దీపికనే హీరోయిన్‌గా తీసుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కనపడడం లేదు.
స్పిరిట్ సినిమా నుంచి దీపిక అవుట్ అయ్యిందట. ఇందుకు దీపిక పెట్టిన కండీషన్లే కారణం అని టాక్ ? ఆరు గంటల కంటే ఎక్కువ షూట్ చేయాల్సి వస్తే తనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని… అలాగే తన స్టాఫ్ అందరి ఖర్చులు భరించాలని… వాళ్లకు జీతాలు కూడా ఇవ్వాలని దీపిక గొంతెమ్మ కోర్కెలు కోరిందట.
స్పిరిట్ సినిమా నిర్మాణంలో సందీప్ రెడ్డి వంగా ఫ్యామిలీకి చెందిన భద్రకాళి పిక్చర్స్ కూడా భాగస్వామి. టి సిరీస్ సంస్థ మరో భాగస్వామి. దీపికా పదుకోన్ కండిషన్లు విన్న తర్వాత సినిమా నుంచి ఆమెను తొలగించేశారని తెలుస్తోంది. ఆ ప్లేస్‌లో మృణాల్ ఠాగూర్‌ను తీసుకునే ఆలోచనలో దర్శకుడు సందీప్ ఉన్నట్టు సమాచారం.