టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సోషియో ఫాంటసీ సినిమా “విశ్వంభర”. అయితే ఈ సినిమా తర్వాత చిరు వెంటనే దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ కామెడీ ఎంటర్ టైననర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇటీవలే నయనతారను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే సాలిడ్ బజ్ అందుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దర్శకుడు చిరు లుక్ టెస్ట్ కంప్లీట్ చేశారట.మెయిన్ గా చిరు వింటేజ్ లుక్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ప్రస్తుతానికి మెగాస్టార్ లుక్ లాక్ చేసుకొని షూటింగ్ కు రెడీ అవుతారట. వీలైనంతవరకు మెగాస్టార్ ని స్టైలిష్ లుక్ లోనే ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు కూడా టాక్. ఈ సినిమాలో నయనతారతో పాటు మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఇంట్రస్టింగ్ అప్‌డేట్…!
