Moviesబ్రేకింగ్‌: అక్టోబ‌ర్‌లో త‌న పెళ్లి.. ప్ర‌క‌టించిన టాలీవుడ్ కుర్ర హీరో...!

బ్రేకింగ్‌: అక్టోబ‌ర్‌లో త‌న పెళ్లి.. ప్ర‌క‌టించిన టాలీవుడ్ కుర్ర హీరో…!

నారావారి హీరో నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ – మంచు మనోజ్తో కలిసి నటించిన భైరవం సినిమా ఈరోజు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక నారా రోహిత్ వ్యక్తిగత విషయానికి వస్తే అన్ని అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఓ ఇంటివాడు అయి ఉండేవాడు. కానీ తండ్రి నారా రామమూర్తి నాయుడు అకాలమరణంతో తన పెళ్లి వాయిదా వేసుకున్నాడు. అప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిన తప్పనిసరి పరిస్థితులలో పెళ్లికి దూరమయ్యాడు. ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసింది. 40 ఏళ్ల నారా రోహిత్ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని రోహిత్ ప్రకటించాడు.Prathinidhi 2: ఓటీటీలోకి ‘ప్రతినిధి 2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ...గత అక్టోబర్లో హీరోయిన్ శిరీష ( సిరి ) తో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇద్దరు కలిసి ప్రతినిధి 2 సినిమా చేశారు. ఆ సినిమా ఫెయిల్ అయినా.. అందులో నటించిన సిరి మాత్రం నారా రోహిత్ లైఫ్ లోకి ఎంటర్ అయింది. ఇదే విషయంపై నారా రోహిత్ కూడా స్పందించాడు. ఇద్దరిదీ ఒకే రకమైన మనస్తత్వం అని .. అందుకే ఇన్‌స్టెంట్గా కనెక్ట్ అయ్యామని చెప్పాడు. ఆ తర్వాత ప్రేమలో పడ్డామని సినిమా షూటింగ్ టైంలో కలిసి పనిచేస్తున్నప్పుడే తమ మధ్య స్నేహం చిగురించే ప్రేమ పుట్టింది అని తెలిపాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ? ఎవరు చెప్పలేరని తన ప్రేమ విషయంలో కూడా అదే జరిగిందని నారా రోహిత్ తెలిపాడు. ఏది ఏమైనా మొత్తానికి టాలీవుడ్ హీరో ఓ ఇంటివాడు అయిపోతున్నందుకు అభినందించాలి.

Latest news