గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆ స్థాయిలో సరైన విజయం ఇప్పటికీ అందుబాటులేక పోయాడు .. ఎన్నో అంచనాలతో ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు .. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసింది .. మధ్యమధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తప్ప షూటింగ్ ఎంతో వేగంగా నడుస్తుంది .. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో 2026 సమ్మర్లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు ..అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది .. 2026 మార్చ్ 26న ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది . అలాగే మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు అందుకే ఈ డేట్ ను ఫిక్స్ చేశారని సమాచారం . ఇప్పటికే ఇప్పుడు వచ్చే చరణ్ బర్త్డేకి ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉంది .. అలాగే ఈ సినిమా టైటిల్ విషయం పై ఇప్పటికే తజన భోజన జరుగుతూనే ఉంది .. పెద్ది అనేది ఈ సినిమా వర్కింగ్ డేటిల్ అయితే అది చరణ్ కు నచ్చలేదు .. దీంతో ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చడం ఖాయంగా కనిపిస్తుంది . సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఓ ఆట చుట్టూ కథ నడుస్తుంది ..
అయితే ఈ సినిమాలో మాత్రం చాలా ఆటలు కనిపిస్తాయని అందులో క్రికెట్ కూడా ఉంటుందని ఇప్పటికే కొన్ని వార్తలు బయటికి వచ్చాయి . అలాగే క్రికెట్ సంచలనం ధోని కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు .. అదేవిధంగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు .. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు .. రీసెంట్ గానే నైట్ ఎఫెక్ట్ లో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు కూడా తెరకెక్కించారు .. జాన్వీ కపూర్ , చరణ్ కు జంటగా నటిస్తుంది .. ఇక మరి ఈ సినిమాతో అయినా చరణ్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.