టాలీవుడ్లో సంక్రాంతి బర్లిలోకి దిగి భారీ విజయాన్ని అందుకుంది విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ ప్రసారానికి రెడీ అవుతోంది. థియేటర్లలో గ్రాండ్‌గా ఆడిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే మూడోసారి హిట్టు అందుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటిటి హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్టు టాక్. ఇప్పటికే థియేటర్ బిజినెస్ పరంగా సంక్రాంతి వస్తున్నాం సినిమా బయ్యర్లకు మంచి లాభాలు అందించింది.ఇంకా చెప్పాలంటే అందరూ పెట్టిన పెట్టుబడికి 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఈ సినిమా లాభాలు తీసుకువచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు నిర్మాతలు దాదాపు 100 కోట్లకు పైగా లాభం తెచ్చినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చిన భారీ నష్టాలను దిల్ రాజు ఈ సినిమాతో బ్యాలెన్స్ చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓటీటీ సంస్థ ఈ సినిమాను ZEE 5 రు. 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అయితే ఓటీటీలో రిలీజ్ కి ముందు టీవీలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఓటిటి రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సాధారణంగా థియేటర్లలో విజయవంతమైన సినిమాలు ఓటీటీలో కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటాయి .. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను అందుకు భిన్నంగా ముందు టీవీలో ప్రసారం చేయాలని నిర్ణయించుకోవడం వల్ల డిజిటల్ రన్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక మాజీ ఐపీఎస్ అధికారి .. అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ .. ప్రస్తుత భార్య ఈ ముగ్గురు మధ్య సాగే కథతో ఎంటర్టైనింగ్ సంక్రాంతి వస్తున్నాం సినిమా సాగుతుంది. యాక్షన్ కామెడీ మిక్స్ చేసి అద్భుతంగా నటించారు.
‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ ఓటీటీ రైట్స్‌తో లాభం ఎన్ని కోట్లో తెలుసా..!
