విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2025
నటీనటులు :విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ, కమెడియన్ పృథ్వి, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీ రాజ్ తదితరులు.
దర్శకుడు :రామ్ నారాయణ్
నిర్మాత :సాహు గారపాటి
సంగీతం :లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ :రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్ :సాగర్ దాడీ
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారిగా లేడీ గెటప్ లో నటించిన మూవీ లైలా .. బట్టల రామస్వామి బయోపిక్ మూవీతో దర్శకుడుగా మారిన సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమాని తెర్కక్కించగా .. భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాహు గారపాటి ఈ సినిమాని నిర్మించారు .. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాల కంటే లేనిపోని హడావుడి ఎక్కువ జరిగింది .. మరి సినిమాగా లైలా ప్రేక్షకులను ఏం మేరకు మెప్పించిందో ఇక్కడ చూద్దాం.
కథ:
సోను మోడల్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ పాత బస్తీలో ఓ బ్యూటిఫుల్ పార్లర్ నడుపుతూ ఉంటారు .. అతని మేకప్ స్కిల్స్ కి అక్కడ ఎంతో మంచి పేరు ఉంటుంది .. అయితే ఒక కస్టమర్ కుటుంబానికి సహాయం చేయాలని ఉద్దేశంతో ఆమె భర్త నడిపించే వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు పెట్టమని చెప్తాడు .. కానీ ఆ చిన్న నిర్ణయం సోనును పెద్ద సమస్యల్లో పడేస్తుంది .. అనుకోని పరిస్థితులు ప్రభావంతో సోను ఎలా లైలాగా మారాల్సి వచ్చింది ? అతను మహిళగా మారిన తర్వాత ఏం జరిగింది? అనేది థియేటర్లో చూడాల్సిందే.నటీనటుల పర్ఫామెన్స్:
ఇక విశ్వక్ సేన్ లైలాలో అమ్మాయిగా నటించడం కొత్తగా అనిపించిన .. తన పాత్రలో పెద్దగా నటనంచే అవకాశం లేకపోవడం కారణంగా అతని అభిమానులకు కొంత నిరాశ మిగిలింది .. కానీ విశ్వక్ సేన్ తన పాత్రకు వందకి వంద శాతం న్యాయం చేశారు .. అలాగే ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ ఏదైనా ఉందంటే అది విశ్వక్ నటన .. ఆకాంక్ష శర్మ గ్లామర్ షో తప్ప చెప్పుకునేంత ప్రాధాన్యత క్యారెక్టర్ లో లేదు .. అలాగే అభిమన్యు సింగ్ పాత్ర పెద్దదే అయినప్పటికీ అతని కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయించాడు .. బబ్లు , పృధ్విరాజ్ , వినీత్ కుమార్ లాంటి నటుల పాత్రలు సినిమాకి చిరాకు తెప్పించేలా ఉన్నాయి .. కామాక్షి భాస్కర్లకు ఓ మంచి పాత్ర దక్కినప్పటికీ ఆమె నటన సాధారణంగానే ఉంది .. సోషల్ మీడియా సెన్సేషన్ సునిషిత్ తన నిజజీవితం పాత్రని సినిమాలో పోషించాడు .. కానీ దాని వినోదాత్మకంగా మార్చడం డైరెక్టర్ కి సాధ్యపడలేదు మొత్తం సినిమాలో ఉన్న పాత్రులు కూడా సగం సగంగా మిగిలిపోయాయి.
టెక్నికల్ విభాగం:
టెక్నికల్గా ఈ సినిమాను చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వరకు బాగానే ఉంది .. ప్రధానంగా లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది .. అదేవిధంగా రీఛార్జ్ ప్రసాద్ సినిమా ఆటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి కొంత హైలైట్ గా ఉంది .. అలాగే ఎడిటర్ సాగర్ దాడి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది .. ఇక ఈ సినిమాలో నిర్మాత సాహూ గారపాటి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో రీచ్‌గా ఉన్నాయి.. రామ్ నారాయణ దర్శకత్వం బాగున్న స్క్రీన్ ప్లే మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
హైలెట్స్:
విశ్వక్సేన్ నటన..
కొంత కామెడీ సన్నివేశాలు..
నిర్మాణ విలువలు..
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథనం…
సాగదీత…
పాటలు..
విశ్లేషణ:
విశ్వక్ సేన్ తన కెరియర్ మొదటిలో హిట్, అశోక వనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలతో తనను తాను మంచి నటుడుగా నిరూపించుకున్నాడు కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’ వంటి కమర్షియల్ ఫార్ములా తో ప్రయోగాలు చేయటమే ఆయనను వెనకడుగు వేసేలా చేసింది .. లైలా కూడా ఇదే కోవకు చెందిన సినిమా .. అయితే పైన చెప్పిన అన్ని సినిమాల్లో కూడా విశ్వక్ నటన ఎక్కడ నిరాశపరచలేదు .. కానీ లైలా కూడా అంతే తన ఎనర్జీ వల్ల పరమా రోటీన్ కథ కూడా పరవాలేదు అనిపిస్తుంది. సినిమా మొదటినుంచి పాత బస్తి కామెడీని, డబల్ మీనింగ్ సంభాషణకు ప్రధానంగా చూపించడం కథమీ లేకుండా అర్థరహిత సన్నివేశాలను నింపటం సినిమాను ఇంట్రెస్టింగ్ గా కానేయకుండా చేసింది. అలాగే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అసలు ప్రేక్షకులకు నచ్చవు .. అలాగే క్లైమాక్స్ పూర్తిగా నిరాశపరిచింది ఫస్ట్ ఆఫ్ పరవాలేదు అనిపించుకున్న సెకండాఫ్ మాత్రం రొటీన్ గా సాగదీతగా అనిపిస్తుంది. మొత్తంగా ఓ మోస్తరు గా తొలిభాగం ఎంతో బోరింగ్ గా రెండో భాగంతో లైలా సినిమా యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది.ఫైనల్ గా: లైలా అంటూ వచ్చిన ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ లేడీ గెటప్ తాలూకు కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఓకే .. అయితే రెగ్యులర్ స్క్రీన్ ప్లే మెయిన్ క్యాటరైజేషన్స్ బలహీనంగా ఉండటం.. కొన్ని బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని ఘోరంగా దెబ్బతీసాయి .. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
రేటింగ్: 2/5