Movies' సంక్రాంతికి వ‌స్తున్నాం ' ఆల్ టైం ఇండ‌స్ట్రీ హిట్‌... తిరుగులేని...

‘ సంక్రాంతికి వ‌స్తున్నాం ‘ ఆల్ టైం ఇండ‌స్ట్రీ హిట్‌… తిరుగులేని రికార్డ్‌…!

ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో వచ్చింది. అటు రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా.. బాల‌య్య డాకూ మ‌హారాజ్ సినిమాలు పోటీలో ఉన్నా కూడా సంక్రాంతికి వ‌స్తున్నాం ఆ రెండు సినిమాల‌ను వ‌న్ సైడ్ చేసేసి తిరుగులేని వ‌సూళ్లు సాధించింది.ఇక జనవరి 14 2025న రిలీజ్ అయిన సంక్రాంతికి వ‌స్తున్నాం ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా నాలుగో వారానికి చేరుకునే సరికి, ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లు వసూలు చేసింది. ప్రాంతీయ సినిమాల‌లో ఆల్ టైం ఇండ‌స్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. ఇంకా కొన్ని చోట్ల సాలిడ్ క‌లెక్ష‌న్లు కూడా రాబ‌డుతోంది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా సాధించిన విజ‌యంతో నిర్మాత‌లు ఫుల్ ఖుషీగా ఉన్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా న‌టించారు. నరేష్, వీటీవీ గణేష్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు.

Latest news