టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఔట్ అండ్ ఔట్ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఆరెంజ్ సినిమా నిలిచింది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ‘ఆరెంజ్’ మంచి క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా అందాల భామ జెనీలియా హీరోయిన్‌గా నటించింది. నాగబాబు నిర్మించిన ఈ సినిమాకు అప్పట్లో హరీష్ జైరాజ్ అందించిన మ్యూజిక్ .. ఆ పాటలు ఎప్పటకీ తెలుగు ప్రేక్షకుల మదిని గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.
అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు టీవీల్లోనూ.. యూట్యూబ్‌లో చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఆరెంజ్ సినిమాను పలుమార్లు రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి రీ – రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఈ సారి కూడా ఆరెంజ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 7 వేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.