Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టు... ఆ అడ‌వుల్లోనే స్టార్ట్ కానుందా..!

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టు… ఆ అడ‌వుల్లోనే స్టార్ట్ కానుందా..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌… మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ రీసెంట్‌గా దేవర సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. గ‌తేడాది చివ‌ర్లో వ‌చ్చిన ఈ సినిమా జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ మ‌రో హిట్ కొట్టింది. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ జోష్‌లో ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ వార్ 2 లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ క‌న్న‌డ‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.RRR' actor Jr NTR teams up with 'KGF' directorఇప్పటికే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ లాంటి పవర్‌హౌజ్‌తో ప్రశాంత్ నీల్ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడా అని ఇండియ‌న్ సినీ జ‌నాలు.. సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తితో ఉన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్పీడ్‌గా న‌డుస్తున్నాయి. ఈ నెల 17 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లోనే ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ షూట్ చేస్తార‌ట‌. తెలంగాణ‌లోని వికారాబాద్ అడవులు, పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.salaar director prashanth neel made interesting comments ksr - salaar director prashanth neel made interesting comments - Asianet News Teluguఇక హీరో ఎన్టీఆర్ మార్చి నెలలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.

Latest news