Moviesఎన్టీఆరే లేక‌పోతే కింగ్‌డ‌మ్ టీజ‌ర్ తుస్సు త‌స్సేనా... !

ఎన్టీఆరే లేక‌పోతే కింగ్‌డ‌మ్ టీజ‌ర్ తుస్సు త‌స్సేనా… !

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ టైగర్ వచ్చేసింది. గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఈ సినిమాకు కింగ్‌డ‌మ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా అఫీషియల్ టీజర్ కూడా బయటకు వచ్చింది. తెలుగులో ఈ టీజర్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక బాలీవుడ్లో రణబీర్ కపూర్ … కోలీవుడ్లో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు టీజర్ వరకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనేది ఈ టీజర్ కు చాలా హైలెట్గా నిలిచింది. ఇంకా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ వినిపించకపోతే టీజర్ ఈపాటికి తేలిపోయి ఉండేదని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.Kingdom Teaser: Three Reasons Why Vijay Deverakonda's Film Looks Epic-Scale  | Times Nowఈ సినిమాలో కనిపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు చాలా సినిమాలలో చూసేసినట్టుగా ఉన్నాయి. దేవర – సలార్ – కేజీఎఫ్ లాంటి సినిమాలలో చూసిన విజువల్స్ ని ఈ టైటిల్ టీజర్ లో మరోసారి చూపించారని అంటున్నారు. ఇక అనిరుధ్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఉన్నంతలో కొత్తగా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌ మాత్రమే. విజయ్ దేవరకొండ చిన్న హెయిర్ తో డిఫరెంట్ గా కనిపించిన అది కూడా ఆకట్టుకోలేదు. అయితే అతడు చివర్లో చెప్పిన మొత్తం తగలబెట్టేస్తా అనే డైలాగ్ కాస్త బాగుంది. రణ భూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం అనే భయంకరమైన ఎలివేషన్ తో విజయ్ దేవరకొండ ను ప్రజెంట్ చేయడం బాగుంది. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.Jr. NTR Biography: Movies, Family, Career, News and Photos

Latest news