Moviesమెగాస్టార్ కల్ట్ మూవీ జగదేకవీరుడు సినిమాను రీమేక్ చేయగలిగే రియల్ హీరో...

మెగాస్టార్ కల్ట్ మూవీ జగదేకవీరుడు సినిమాను రీమేక్ చేయగలిగే రియల్ హీరో అతనే.. మనసులో మాట చెప్పిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే గొప్ప సినిమాల్లో ఒకటి .. అప్పట్లోనే ఈ సినిమా సంచలన విజయం సాధించి మెగాస్టార్ అభిమానులకు మెమ‌ర‌బుల్ సినిమాగా నిలిచింది .. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి చేసిన సినిమాలన్నీ వ‌రుస విజ‌య‌లు సాధిస్తూ ఆయనకంటూ ప్రత్యేకతను తీసుకొచ్చి పెట్టాయి . అలా చిరంజీవి తనకు వచ్చిన మెగాస్టార్ అనే బిరుదుకు ఎప్పటికప్పుడు న్యాయం చేస్తూ వచ్చారు ..Jagadeka Veerudu Atiloka Sundari || Chiranjeevi, Sridevi,Bramhanandham ||  Telugu Full Movies - YouTubeఅలా ఆయన కెరియర్ లో ఒక సినిమా ప్లాప్ అయ్యిందంటే చాలు తర్వాత మరో సినిమాతో భారీ విజ‌యం సాధిస్తూ మిగిలిన హీరోల‌ తిరుగులేని పోటిని సైతం తట్టుకుని 40 సంవత్సరాలగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుని ముందుకు దూసుకుపోతున్నాడు .. ఈ వయసులో కూడా వ‌రుస సినిమాల చేస్తూ బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాడు. అయితే చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను ఒకవేళ ఇప్పుడు రీమేక్ చేయాల్సి వస్తే మాత్రం ఈ సినిమాను ప్ర‌జెంట్ ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ ఐతే ఈ మూవీని చాలా అద్భుతంగా చేస్తాడంటూ చిరంజీవి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చాడు ..Prabhas: ప్రభాస్‌ ఖాతాలో మరో మూడు.. మొత్తం8 ప్రాజెక్టుల్లో పాన్‌ ఇండియా  స్టార్‌ | hot-buzz-on-prabhas-new-projectsప్రభాస్ లాంటి స్టార్ హీరో కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ..అలాగే ఇప్పుడున్న హీరోల్లో భారీ మార్కెట్ కలిగి ఉన్న హీరోల్లో ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు .. ఆయన కనుక ఈ సినిమా చేస్తే ఎక్కువ రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చిరు చెప్పడం విశేషం. ఇక మరి ఏదేమైనా కూడా చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో ప్రభాస్ లాంటి మరో యంగ్ స్టార్ హీరోతో తన సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం .. ప్రస్తుతం చిరంజీవి భారీ సక్సెస్ కోసం ఎంతోకాలంగా ఎదురు చేస్తున్నాడు. ఆ అందుకు అనుగుణంగానే యంగ్‌ దర్శకులతో వరుస‌ సినిమాలకు కమిట్ అవుతూ భారీ విజయాలు అందుకోవాలని చూస్తున్నాడు . అయితే చిరంజీవి అనుకున్నట్టుగానే రాబోయే సినిమాతోపెను సంచలనాలు సృష్టిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది .

Latest news