Moviesమూడుసార్లు వ‌ద్దంటూనే నాలుగోసారి ఓకే చేసి ప‌ర‌మ డిజాస్ట‌ర్ సినిమా చేసిన...

మూడుసార్లు వ‌ద్దంటూనే నాలుగోసారి ఓకే చేసి ప‌ర‌మ డిజాస్ట‌ర్ సినిమా చేసిన చిరంజీవి..?

సాధారణ స్టార్ హీరోలు ఏ సినిమా చేసిన ఆ సినిమా హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ అందరికీ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో కొన్ని సినిమాల విషయంలో అది ప్లాప్ అవుతూ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకోక తప్పదు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకునే కాన్ఫిడెన్స్ తో చేసిన ఆ సినిమా ప్లాప్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలతో పాటు ప్లాప్ సినిమాలలో కూడా నటించారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఒక సినిమా విషయంలో మూడు సార్లు కథ విని రిజెక్ట్ చేసి సినిమా ప్లాప్ అవుతుందని భయపడి మళ్లీ నాలుగో సారి కన్విన్స్ అయ్యి చేసిన ఓ పెద్ద సినిమా డిజాస్టర్ అయింది.

Watch Anji (Telugu) Full Movie Online | Sun NXTఆ సినిమా ఏదో కాదు అంజి సినిమా. చిరంజీవి హీరోగా 20 సంవత్సరాల క్రితం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అంజి సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా అప్పట్లో గ్రాఫిక్స్ పరంగా బాగా హైలైట్ అవుతుందని అంతా భావించారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా కథ మూడుసార్లు విని రిజెక్ట్ చేసిన చిరంజీవి .. నాలుగోసారి కన్విన్స్ అయిపోయారు. ఫైనల్ గా సినిమా అంచనాలు అందుకోలేదు.

Latest news