నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్గా బాలీవుడ్లో చావా మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది .. చత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెర్కక్కించారు .. ప్రధానంగా నార్త్ లో మహారాష్ట్రలో శివాజీ మహారాజ్‌ను దేవుళ్ళ భావిస్తారు .. అలాంటి చత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు జీవిత కథతో సినిమా రావడంతో ఎలా ఉంటుందో? అనే ఆసక్తి సిని ప్రేక్షకుల్లో కలిగింది .. శంబాజీగా విక్కీ కౌశల్ అతని భార్య యేసుభాయిగా రష్మిక నటించారు .. తన సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడుకుంటూనే రాజ్య విస్తరణ ఎలా చేయాలనే దానిపై భార్యతో కలిసి ప్రణాళికలు రచిస్తూంటాడు.. మొఘలులు తమకు అడ్డుగా ఉన్నాడని శంభాజీని అడ్డు తొలగించుకోవాలనుకుంటారు.అందుకోసం వారు ఎంచుకున్న విధానమే ఈ సినిమాగా తెర్కక్కించారు .. శంబాజీ ని వెన్నుపోటు పొడుస్తారు .. ఆయన లేని సమయంలో మహారాణిగా రష్మిక రాజ్యం మొత్తాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటారు .. విక్కీ కౌశల్ ఎంతో అద్భుతంగా నటించారని విశేషకులు కూడా పొగుడుతున్నారు .. మొదటి రోజు ఈ సినిమాకు 30 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా దూసుకుపోయింది .. ఈ క్రమంలోని ముంబైలో ఈ సినిమా సక్సెస్ మీట్‌లో రష్మిక మాట్లాడింది .. అక్కడ తను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటికీ ముంబై ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారంటూ ఆమె అక్కడ కృతజ్ఞతలు తెలిపింది .. ఇక్కడ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు నాకెంతో సంతోషంగా ఉందని కూడా ఆమె అంది.
అయితే ఎప్పుడు రష్మిక మాట్లాడిన మాటలపై కన్నడ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు .. అప్పుడే తాను పుట్టి పెరిగిన ప్రాంతం సొంత ఊరు తనకు జీవితాన్ని ఇచ్చిన కన్నడ పరిశ్రమను మర్చిపోయిందంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు .. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట్ రష్మిక పుట్టి పెరిగిన ఊరు .. వీరాజ్ పేట్ నుంచి రష్మిక హైదరాబాద్ కు ఎప్పుడు మారిందంటూ వారు ప్రశ్నిస్తున్నారు .. దీనిపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది .. గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో టాలీవుడ్ డే తన పుట్టినిల్లుగా ఈమె చెప్పకు వచ్చింది .. అప్పుడు కూడా కన్నడ ప్రజలు రష్మికపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .. ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి రష్మిక ఇప్పటికైనా ఈ వివాదాలకు సద్ది చెబుతుందో లేదో చూడాలి.