టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’
నటులు:వెంకటేష్,ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి,ఉపేంద్ర లిమాయే,సాయి కుమార్,వీకే నరేష్,వీటీవీ గణేష్
దర్శకుడు: అనీల్ రావిపూడి
సినిమా శైలి:ఫ్యామిలీ డ్రామ కామెడీ ఎంటర్ టైనర్
వ్యవధి:2 గంటల 24 నిమిషాలుఈ సంక్రాంతికి రేసులో చాలా సినిమాలే ఉన్న అందరి కళ్ళు మాత్రం వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పైనే ఉన్నాయి. దానికి కారణం ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ ఈ సినిమాలో నటించడమే . అంతేకాదు ఒకప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో .. ఆ స్థాయిలో ఈ సినిమా హిట్ అవుతుంది అని ముందుగానే అంచనా వేసేసారు ఫ్యాన్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం జనాలు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేసింది . గతంలో వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ టాక్ అందుకుంది . అటు వెంకటేష్ కి..ఇటు అనిల్ రావిపూడి కి మంచి మార్కులు తెచ్చిపెట్టింది . హిస్టరీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ప్రతి విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తో అలాంటి ఒక క్రేజీ హిట్ కొట్టడానికి బాగా ఎంటర్టైన్ చేయడానికి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు . ఈ సినిమా హిట్ అవుతుందని ముందే జనాలు ఫిక్స్ అయిపోయారు . రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అలాంటి ఇంట్రెస్ట్ పెంచేశాయి. అయితే ఈ సినిమా కథ ఏంటి..? కథనం ఏంటి..? కధా గమనం ఏంటి..? అన్నదానిపై ఓ లుక్కేద్దాం రండి..!
కథ:
ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన రాజు (వెంకటేష్), భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్)లది హ్యాపీ ఫ్యామిలీ. గోదారిగట్టుపైనా రామచిలకవే అని భాగ్యాన్ని తెగ విపరీతంగా ప్రేమించేస్తుంటాడు రాజు. ఓ హ్యపీ మూమెంట్‌లో తన ఫస్ట్ లవ్ స్టోరీని భార్యతో మొత్తం చెప్తాడు. అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న టైంలో ట్రైనీగా వచ్చిన మీనా (మీనాక్షిచౌదరి)తో సాగించిన ప్రేమకథను పిన్ టూ పిన్ భాగ్యంతో చెప్తాడు. ఓ కేసులో తప్పు చేయని కారణంగా సస్పెషన్‌కి గురైన రాజు.. హైప్రొఫైల్ కిడ్నాప్ కేసుని ఛేందించే బాధ్యతను తీసుకుంటాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని సవాల్‌గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే ఛేదించగలడని నమ్మి.. అతని సస్పెన్షన్‌ను ఎత్తి వేసి నేరస్థులను పట్టుకునే బాధ్యతను ఆయనపై పెడతారు. దానికోసమే మాజీ ప్రియురాలు (మీనాక్షి చౌదరి)తో కలిసి ఒక అడ్వెంచర్ జర్నీకి వెళ్తాడు. ఈ ప్రయాణంలో భార్య భాగ్య లక్ష్మి (ఐశ్వర్య రాజేష్) కూడా యాడ్ అవుతుంది. ఈ కేసులో వీరికి ఎదురయ్యే కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లులతో కూడిన కథే ఈ సినిమా.
TL విశ్లేషణ & డైరెక్షన్ :
ఒక ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . కాగా రాజు క్యారెక్టర్ లో వెంకటేష్ పూర్తిగా లీనమైపోయినటించాడు. ఒకపక్క భార్యని మరొకపక్క మాజీ ప్రియురాలని హ్యాండిల్ చేసే రోల్లో వెంకటేష్ అదిరిపోయే రేంజ్ లో కామెడీ పండించారు . దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి రాసుకున్న నాటి నాటి డైలాగ్స్ ఒక భార్య ఒక భర్త మధ్య చిలిపి సరసాలు ..సరదాలు.. తగాదాలు బాగా తెరపై చూపించారు . అటు నటన పరంగా వెంకటేష్ ఇటు డైరెక్షన్ పరంగా అనిల్ రావిపూడి ఇద్దరు కూడా ఈ పాయింట్ లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి . ఫస్ట్ హాఫ్ ని అనిల్ రావిపూడి బోర్ కొట్టించకుండా మేనేజ్ చేశారు. మాజీ పోలీస్ అధికారిగా ఉన్న వైడి రాజు ( వెంకటేష్) గోదావరి జిల్లాలో ఫ్యామిలీతో నివసిస్తుంటారు. అతడిని ఒక అసైన్ మెంట్ కోసం మళ్ళీ పిలవడం అనేది ఈ చిత్రంలో మెయిన్ పాయింట్.ఒకపక్క డైరెక్షన్ మరొకపక్క నటీనటుల పర్ఫామెన్స్ ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణంగా మారాయి . అక్కడక్కడ వచ్చే భార్యాభర్తల నాటీ సిన్స్ కూడా థియేటర్స్ కి వచ్చిన జనాలను మరి ముఖ్యంగా భార్యాభర్తలను తమ పాస్ట్ కి సంబంధించిన కొన్ని కొన్ని నాటి రొమాంటిక్ సీన్స్ ని కూడా గుర్తు చేసుకునే విధంగా అనిల్ రావిపూడి కొన్ని సీన్స్ బాగా హైలైట్ గా డైరెక్ట్ చేశారు. లాజిక్స్ పక్కన పెట్టి కామెడీపైనే ఫోకస్ పెట్టారు. అలాంటప్పుడు కామెడీ వర్కౌట్ అయితే ఓకె. లేకుంటే ఆడియన్స్ కి చిరాకు రావడం ఖాయం. కథ కూడా గొప్పగా అనిపించేలా ఉండదు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి.
నటీనటుల పెర్పామెన్స్ :
రాజు పాత్రలో వెంకటేష్ చించేశాడు. భార్యని తాను ఎంత గా ప్రేమిస్తున్నానో చెప్తూనే కిడ్నాప్ కేసుని సాల్వ్ చేస్తాడు. ఇక భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించలేదు..జీవించేసింది. అంతేకాదు తన భర్త ఎక్కడ మాజీ ప్రియురాలి ప్రేమలో పడిపోతాడో అన్న భయంతో ఐశ్వర్యరాజేష్ చూపించే అతి ప్రేమ.. వినయం ..అనుమానం అన్నీ కూడా తెర పై బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మీనాక్షి చౌదరి ఎప్పుడు కూడా తన కేసు పై కాన్సన్ట్రేషన్ చేసే పద్ధతి హైలెట్గా మారింది . ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా వాళ్ల పాత్రలకి తగిన న్యాయం చేశారు.
బలం: ఈ టోటల్ సినిమా కి మొత్తం బలం కామెడీనే. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కామెడీతో నిండి ఉంది. ప్రతి సీన్ ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది.కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి .సినిమాలోని పాటలు బాగున్నాయి. లోఖేషన్స్ కూడా బాగున్నాయి.
లోపాలు: రొటీన్ కథ..సీన్స్ ముందుగానే ప్రిడిక్ట్ చేయడం.. కథ కొత్తగా చూపించలేకపోవడం.. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో ముందే చూసేయడం . సినిమా నిడివి కాస్తా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ముగింపు: ఓవరాల్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఛాయిస్. కాకపోతే కొన్ని ఇరిటేషన్ తెప్పించే సన్నివేశాలు కూడా భరించాలి. వెంకటేష్ అభిమానులు మరియు కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కొత్త కథ కోసం వెతుకుతున్న వారికి ఈ సినిమా కొంచెం బోర్ కొట్టేలా ఉండవచ్చు. అదే విధంగా కథ ఆశించకూడదు.ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా ఈ కండిషన్స్ కి ఒకే అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ కామెడీతో సంతృప్తి పరిచేలా ఉంటుంది.
“సంక్రాంతికి వస్తున్నాం” ఫైనల్ పంచ్: ఒక చక్కటి ఫన్-ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘సంక్రాంతికి వస్తున్నాం’ TL రేటింగ్: 3 / 5