Moviesబాల‌య్య గొప్ప‌త‌నం ఎలాంటిదో చెప్పిన టాలీవుడ్ హిట్ డైరెక్ట‌ర్‌..!

బాల‌య్య గొప్ప‌త‌నం ఎలాంటిదో చెప్పిన టాలీవుడ్ హిట్ డైరెక్ట‌ర్‌..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తాజాగా ఈ సంక్రాంతికి డాకూ మ‌హారాజ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కొల్లి బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా విజ‌యోత్స‌వ స‌భ నిన్న అనంత‌పురంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బాబి బాల‌య్య వ్య‌క్తిత్వంతో పాటు గొప్ప‌త‌నం ఎలాంటిదో చేసిన కామెంట్లు నంద‌మూరి ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చాయి.తాను బాలయ్య గారిని కలిసిన మొదటిరోజే తన గురించి అడిగార‌ని.. అప్పుడు తాను ముందు నుంచి చిరంజీవి గారి అభిమానిని అని … ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పినపుడు బాలకృష్ణ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఎంకరేజ్ చేసిన విష‌యం బాబి గుర్తు చేసుకున్నారు.ఇత‌ర హీరోల విష‌యంలో ఇలా జ‌రిగిందో లేదో నాకు తెలియ‌దు కాని.. బాల‌య్య వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ది అని.. ఈ విష‌యాన్ని తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా చెప్ప‌లేద‌ని బాబి తెలిపారు. ఈ కామెంట్స్‌తో బాల‌య్య వ్య‌క్తిత్వం… గొప్ప‌త‌నం ఎలాంటిదో మ‌రోసారి క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. ఈ కామెంట్లు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానుల్లో కూడా వైరల్ గా మారాయి.

Latest news