Moviesబాల‌య్య - బోయ‌పాటి సినిమాలో ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్స్ ..!

బాల‌య్య – బోయ‌పాటి సినిమాలో ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్స్ ..!

సంయుక్తా మీన‌న్‌ టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం మంచి లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా భీమ్లా నాయక్‌లో జోడిగా నటించింది. అలాగే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలోను జోడి కట్టింది. ఒక టైంలో టాలీవుడ్‌లో మంచి లక్కీ హీరోయిన్‌గా సంయుక్త పేరు మార్మోగింది. అందంతో పాటు.. కావలసిన టాలెంట్ ఉన్న ఎందుకో ఆమె స్టార్ హీరోయిన్ కాలేదు.Pragya Jaiswal (@jaiswalpragya) • Instagram photos and videosస్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ఆమె తలుపు తట్టింది. బోయపాటి – బాలయ్య కాంబినేషన్‌లో అఖండ 2లో సంయుక్తను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఒక హీరోయిన్. ఆమెకు బాలయ్యతో ఇది మూడో సినిమా. అఖండ సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజు సినిమాలోను ప్రగ్య జోడీగా నటించింది. ఇప్పుడు అఖండ 2లో కూడా ఆమె నటిస్తోంది. అఖండ సినిమాలో ప్రగ్యా పాత్రకు కంటిన్యూగా.. ఈ సినిమాలో ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తోంది.Smile, it's contagious!🤍✨ #samyuktha #samyukthamenonఅయితే సంయుక్త మీనన్‌ను ఏ పాత్రకి తీసుకున్నారు అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఏ పాత్రకి తీసుకున్న బాలయ్య సినిమాలో సంయుక్తకు అవకాశం అంటే కచ్చితంగా ఆమెకి మంచి అవకాశం అని చెప్పాలి. పైగా బోయపాటి సినిమాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. బోయపాటి సినిమాలలో బలమైన స్త్రీ పాత్ర‌లు ఉంటాయి. సంయుక్తా మీన‌న్‌ కూడా ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకుంది. ఇటు మిడిల్ రేంజ్ హీరోల‌తో పాటు.. అటు సీనియర్ హీరోల పక్కన కూడా మంచి అవకాశాలు వస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.

Latest news