Moviesదారుణంగా పడిపోయిన "గేమ్ చేంజర్" కలెక్షన్స్..మెగా ఫ్యామిలీ చరిత్రలోనే చెత్త రికార్డు..!

దారుణంగా పడిపోయిన “గేమ్ చేంజర్” కలెక్షన్స్..మెగా ఫ్యామిలీ చరిత్రలోనే చెత్త రికార్డు..!

సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ తాజాగా నటించిన సినిమా “గేమ్ చేంజర్”. బాక్స్ ఆఫీస్ వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ అందుకుంది . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని టాక్ వినిపించినప్పటి నుండి జనాలకి ఎదో బ్యాడ్ సెంటిమెంట్ తడుతూనే వచ్చింది . పైగా సినిమాలో పెద్దగా కథ లేకపోవడం . ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణంగా మారిపోయింది.Game Changer (film) - Wikipedia

రామ్ చరణ్ నటన గురించి అందరు ప్రశంసిస్తున్న రామ్ చరణ్ నటన కన్నా శంకర్ డైరెక్షన్ చెత్తగా ఉంది అనడంతో సినిమాకి మరింత నెగిటివ్ వచ్చేసింది. కాగా ఈ సినిమా జనవరి 10వ తేదీ రిలీజ్ అయింది . అప్పటి నుంచి కలెక్షన్స్ చూసుకుంటే తగ్గిపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా మొదటి రోజు 186 కోట్లు కలెక్ట్ చేసిన ‘గేమ్ చేంజఋ.. ఆ తర్వాత రెండవ రోజు నుంచి కలెక్షన్స్ డౌన్ ఫాల్ అవ్వడం ప్రారంభమయ్యాయి . పైగా ‘డాకు మహారాజ్’ సినిమా రిలీజ్ అవ్వడం ..ఆ సినిమా హిట్ అవ్వడం గేమ్ చేంజర్ కి మించిన స్థాయిలో హిట్ అవ్వడం గేమ్ చేంజర్ కలెషన్స్ పడిపోవడానికి కారణమైంది.Game Changer (2025) - IMDbఅంతేకాదు ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకోవడంతో గేమ్ చేంజర్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి . కాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ ఐదవ రోజు కలెక్షన్స్ అటు ఇటుగా కేవలం నాలుగు కోట్ల రేంజ్ లోనే ఉండిపోయింది . ఒక గ్లోబల్ స్టార్ లాంటి హీరోకి ఇలాంటి కలెక్షన్స్ నిజంగా దారుణం అంటున్నారు జనాలు . అంతేకాదు మెగా ఫ్యామిలీకి ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే హిందీలో దారుణాతి దారుణంగా ఉన్నాయి ‘గేమ్ చేంజఋ కలెక్షన్స్ . రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి డౌన్ ఫాల్ అవుతూనే వస్తున్నాయి కలెక్షన్స్. కాగా ఐదవ రోజుకి ‘గేమ్ చేంజఋ కలెక్షన్స్ కో మరింత స్థాయిలో పడిపోవడంతో మెగా ఫ్యాన్స్ డీలా పడుతున్నారు. ఈ డిజాస్టర్ టాక్ నుండి బయట పడ్డాలి అంటే కచ్చితంగా సుకుమార్ సినిమాతోనే అది సాధ్యమవుతుంది అంటున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

Latest news